గ్రామీణా ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-03T10:25:13+05:30 IST
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, ఆక్టోబరు 2 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెంగళాపూర్, మల్లన్నపేట, గొల్లపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల వద్ద శిలాఫలకాలను ఆ విష్కరించి భూమి పూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వికలాంగులకు ట్రై సైకిళ్లను, నిరుపేద యువతులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లన్నపేటలో డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వసంత, ప్రజా ప్రతినిధులు శంకరయ్య, సత్తయ్య, జలేంధర్, రమ్య, నర్సయ్య, రాజన్న, మల్లారెడ్డి, కి షోర్, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి, వైస్ చైర్మన్ గంగాధర్, పార్టీ అధ్యక్షుడు రమేష్ సింగిల్‌విండో చైర్మన్లు రాజ సుమన్‌రావు, వెం కటమాధవ రావు పాల్గొన్నారు.