భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2020-12-07T05:48:29+05:30 IST

కేంద్ర సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈనెల 8న రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ పక్షాన సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు
మంత్రి గంగుల కమలాకర్‌

రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా పాల్గొనాలి

మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈనెల 8న రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ పక్షాన సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో తాను బంద్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. బంద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతోపాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-07T05:48:29+05:30 IST