దళిత, ముస్లింలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చిన్నచూపు

ABN , First Publish Date - 2020-12-28T04:25:02+05:30 IST

దళిత, ముస్లింల వాడలు, డివిజన్ల అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌హుస్సేన్‌ ఆరోపించారు.

దళిత, ముస్లింలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చిన్నచూపు
మాట్లాడుతున్న ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్‌ హుస్సేన్‌

ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌హుస్సేన్‌ 

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 27: దళిత, ముస్లింల వాడలు, డివిజన్ల అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌హుస్సేన్‌ ఆరోపించారు. ఆదివారం నగరంలోని ఎంఐఎం కార్యాలయంలో ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు దళిత, ముస్లింల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ఎమ్మల్యేలు తీరు మార్చుకోని పక్షంలో ఎంఐఎం క్రియాశీల పోరాటాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌ సమి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీని ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణ బద్దులై కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంఐఎం ప్రధానకార్యదర్శి బర్కత్‌ అలీ, ఉమ్మడి జిల్లాబాధ్యులు యూసుఫ్‌ నదీమ్‌, సాబీర్‌, హాబీబుల్లా మస్రత్‌, అఖీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:25:02+05:30 IST