మిడ్‌మానేరు జలాశయం నీటిమట్టం 317.31 మీటర్లు

ABN , First Publish Date - 2020-10-19T17:25:22+05:30 IST

శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 6477 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మిడ్‌మానేరు జలాశయం నీటిమట్టం 317.31 మీటర్లు

రాజన్న సిరిసిల్ల: శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 6477 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.31 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.527 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 25.786 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 9778 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 6477 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-10-19T17:25:22+05:30 IST