మిడ్‌ మానేరు నిర్వాసిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-19T06:30:18+05:30 IST

మిడ్‌ మానేరు నిర్వాసిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ నీటి పారుదల శాఖ, భూ సేకరణ అధికారులను ఆదేశించారు.

మిడ్‌ మానేరు నిర్వాసిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌

సమీక్షా సమావేశంలో నీటి పారుదల, భూ సేకరణ అధికారులకు వినోద్‌ కుమార్‌ ఆదేశాలు

కరీంనగర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మిడ్‌ మానేరు నిర్వాసిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ నీటి పారుదల శాఖ, భూ సేకరణ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ నిర్వాసిత గ్రామాల్లో మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినోద్‌ కుమార్‌ ఇరిగేషన్‌, భూ సేకరణ అధికారులకు సూచించారు. గ్రామాల వారీగా మిగిలిపోయిన సమస్యలను గుర్తించి 15 రోజుల్లోగా నివేదికను కలెక్టర్‌కు అందజేయాలన్నారు. సమావేశంలో నీటి పారుదలశాఖ భూ సేకరణ విభాగం రాష్ట్ర ఓఎస్డీ మనోహర్‌, మిడ్‌ మానేరు ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌, ఈఈ రామకృష్ణ, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-19T06:30:18+05:30 IST