శివారు ప్రాంతాల్లో వసతులు కల్పిస్తాం

ABN , First Publish Date - 2020-12-13T05:34:28+05:30 IST

శివారు ప్రాంత డివిజన్లలో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని మేయర్‌ సునీల్‌రావు స్పష్టం చేశారు.

శివారు ప్రాంతాల్లో వసతులు కల్పిస్తాం
అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మేయర్‌ సునీల్‌రావు

 మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌ రూరల్‌, డిసెంబరు 12: శివారు ప్రాంత డివిజన్లలో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని మేయర్‌ సునీల్‌రావు స్పష్టం చేశారు. శనివారం తీగలగుట్టపల్లిలోని 1వ డివిజన్‌ చంద్రపూర్‌కాలనీ, రెండవ డివిజన్‌ విద్యారణ్యపురిలో మేయర్‌ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరపాలక సంస్థ జనరల్‌ ఫండ్‌ నుంచి కేటాయించి లక్షా 60 వేల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్‌, కాశెట్టి శ్రీనివాస్‌లతో కలిసి మేయర్‌ పనులను ప్రారంభించారు. అనంతరం 2వ డివిజన్‌లోని మెయిన్‌ డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఇప్పటికే విలీన గ్రామాల అభివృద్ధి కోసం డివిజన్ల వారిగా కౌన్సిల్‌ సమావేశంలో నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. వాటికి టెండర్లు ప్రక్రియను కూడా పూర్తి చేసి ఒక్కొక్కటిగా దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టి డివిజన్ల రూపు రేఖలు మార్చుతామన్నారు. మంచినీటి వసతి నేపథ్యంలో పైపులైన్‌ లేని ప్రదేశాల్లో మంచినీటి పైపులైన్లు వేసి ప్రజలకు తాగునీరందించడం జరుగుతుందని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో తాగునీటి సమస్య కొంత ఉన్నప్పటికీ ఆ సమస్యను పరష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:34:28+05:30 IST