ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇంటికే..

ABN , First Publish Date - 2020-03-04T07:33:35+05:30 IST

ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇంటికే..

 నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

12,768 మంది విద్యార్థులకు 24 కేంద్రాలు

అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు


పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 3: ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి 18వతేదీ వరకు జరగ నున్న పరీక్షలకు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమ తించవద్దని ఇంటర్‌బోర్డు నోడల్‌ అధికారు లకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల కు అరగంటముందుగానే చేరుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో12,768 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 కేంద్రాలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, ఒక కేంద్రం మోడల్‌ స్కూల్‌లో, 8 కేంద్రాలను ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకుపరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ఆరంభానికి గంటముందు నుంచే విద్యార్థుల ను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు.


మొద టి సంవత్సరంలో సాధారణ కోర్సులు అభ్యసి స్తున్న విద్యార్థులు 4,797మంది పరీక్ష రాస్తుం డగా, వృత్తి విద్యాకోర్సు వారు 1,321 మంది, మొత్తం 6,118మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో సాధారణకోర్సులు అభ్యసిస్తు న్న విద్యార్థులు 5,430మంది ఉండగా, వృత్తి విద్యా కోర్సులవారు 1,220మంది, మొత్తం 6,650మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకుగాను 24మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 24మంది అసిస్టెంట్‌ డిపార్ట్‌ మెంటల్‌ అధికారులను, 354మంది ఇన్విజి లేటర్లను నియమించారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఉండేందుకు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఏర్పాటు చేశా రు. ఇందులో ఒకజూనియర్‌ లెక్చరర్‌, ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఒకఏఎస్‌ఐ ఉంటారు. సమస్యాత్మక కేంద్రాల్లో 4సిట్టింగ్‌ స్క్వాడ్‌ లను ఏర్పాటు చేశారు. 


పరీక్షా కేంద్రం తెలుసుకునేందుకు యాప్‌..

పట్టణకేంద్రాల్లో పరీక్షాకేంద్రాలు అధికంగా ఉండడంతో కేంద్రాల అడ్రస్‌లు తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం అనే నిబంధనతో పరీక్షరాయలేని పరిస్థితి ఉండ డంతో ముందస్తుగానే పరీక్షా కేంద్రం లోకే షన్‌ తామునివాసం ఉన్నచోటి నుంచి ఎంత దూరంలో ఉన్నది, ఎక్కడఉన్నది అనే సమా చారం తెలుసుకునేందుకు వీలుగా ఇంటర్‌ బోర్డు ఒకయాప్‌ను రూపొందించింది. గూగు ల్‌ ప్లేస్టోర్‌ నుంచి టీఎస్‌బీఐఈ అనే యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోరిజల్ట్స్‌, ఎగ్జామ్‌ లోకేటర్‌, స్టూడెంట్స్‌ సర్వీస్‌, ఇతర సర్వీసులు ఉంటాయి. సెంటర్‌ చిరునామా తెలుసుకునేందుకు ఎగ్జామ్‌ లొకేటర్‌ను నొక్కి అందులో కేంద్రం పేరు నమోదు చేస్తే లోకేషన్‌ వస్తుంది.


తాము చదువుతున్న కళా శాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వ కుంటే వెబ్‌సైట్‌ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా పరీక్షకు హాజర య్యేందుకు ఇంటర్‌ బోర్డు వెసులుబాటు కల్పించింది. ్టటఛజ్ఛీ. ్ఛజజ. జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ద్వారా హాల్‌టికెట్‌ పొంద వచ్చని నోడల్‌అధికారి కల్పన తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌, జనన తేదీ నమోదు చేస్తే హాల్‌ టికెట్‌ వస్తుందని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్‌టికెట్‌ నంబర్‌, జనన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు చేశామని, విద్యార్థులకు తాగునీటితో పాటు, వైద్య సౌకర్యాన్ని కూడా కల్పిస్తు న్నామని నోడల్‌ అధికారి తెలిపారు. 


 ‘ఖని’లో ఇంటర్మీడియట్‌  పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు


కోల్‌సిటీటౌన్‌, మార్చి 3: ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పూర్తయ్యాయి. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రామగుండం, గోదావరిఖని, ఎన్‌టీపీసీ ప్రాంతాల్లో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,738 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గోదావరిఖనిలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, కృష్ణవేణి వికాస్‌, ఎన్‌టీపీసీలోని సచ్‌దేవ, రామగుండం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష కేంద్రానికి 8గంటలకే విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతివ్వమని చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. 

 

Updated Date - 2020-03-04T07:33:35+05:30 IST