-
-
Home » Telangana » Karimnagar » mahilaa dongala mutaa arest
-
మహిళా దొంగల ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2020-11-26T05:26:49+05:30 IST
మహారాష్ట్రకు చెందిన మహిళా దొంగల ముఠాసభ్యులు మమత లండే(30), కాజల్ మంకార్(22), మంకార్ అంజలీ అలియాస్ సంగీత(28), సవిత హతగాడి(30) కరీంనగర్ ఒకటోఠాణా పోలీ సులు బుధవారం అరెస్టు చేశారు.

కరీంనగర్ క్రైం, నవంబరు 25: మహారాష్ట్రకు చెందిన మహిళా దొంగల ముఠాసభ్యులు మమత లండే(30), కాజల్ మంకార్(22), మంకార్ అంజలీ అలియాస్ సంగీత(28), సవిత హతగాడి(30) కరీంనగర్ ఒకటోఠాణా పోలీ సులు బుధవారం అరెస్టు చేశారు. దోబీవాడ ఎల్‌ఐసీ చౌరస్తా వద్ద అనుమా నాస్పదంగా ఉన్న ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగత నాలు చేస్తున్న విషయంవెల్లడైంది. నలుగురు మహిళాసభ్యులున్న ఈ దొంగ లముఠా బస్సులోని మహిళా ప్రయాణికుల హాండ్‌బ్యాగ్‌లలో నగదు, ఆభర ణాలు, ఇతరవిలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. బస్సుఎక్కే సమయంలో ప్రయాణికులమాదిరిగా ఉంటూ మహిళల హాండ్‌బ్యాగ్‌ల జిప్లను తెరచి అందులోని విలువై సొమ్మును దొంగిలించి ఆవెంటనే బస్సు దిగిపోతుంటారు. మంగళవారం ఈ ముఠా కరీంనగర్ బస్టాండ్‌లో ఇదే విధంగా ఒక మహిళ బ్యాగ్‌లో నుంచి బంగారునెక్లెస్ దొగిలించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకు న్నారు. అయితే ఆ నెక్లెస్‌ను మహారాష్ట్రకు చెందిన జితేందర్ లండెకు ఇచ్చా మని పట్టుబడిన మహిళా దొంగలు ఒప్పుకున్నారు. జితెందర్ లండే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మహిళాదొంగలు గంజాయిని కూడా విక్రయి స్తున్నారని ఒకటోఠాణా సీఐ జీ విజయ్‌కుమార్ తెలిపారు.