మహాశివరాత్రి జాతర సందర్భంగా నిరంతర వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-02-12T11:57:35+05:30 IST

మహాశివరాత్రి జాతర పర్వదినం సందర్భంగా నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా   నిరంతర వైద్యసేవలు

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌


వేములవాడ, ఫిబ్రవరి 11 :  మహాశివరాత్రి జాతర పర్వదినం సందర్భంగా నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వేములవాడ సామాజిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడు తూ జాతర కోసం నలుగురు జిల్లా ప్రోగ్రాం అధికారులు, 29 మంది వైద్యాధికారులు, 31మంది సూపర్‌వైజర్లు, 50 మంది హెల్త్‌ అసిస్టెం ట్లు, నలుగురు ఫార్మాసిస్టులు, నలుగురు ఫీల్డ్‌వర్కర్లతో పాటు 108, 102 సిబ్బంది కలిపి మొత్తం 152 మందితో మహాశివరాత్రి జాతర లో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.


డాక్టర్‌ సుమన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ జాతరలో పనిచేసే వైద్య సిబ్బంది విధినిర్వహ ణను మాధవసేవగా భావించి పనిచేయాలన్నారు. ఆలయ ఈవో కాంప్లెక్స్‌, ప్రధాన ఆలయం, అమ్మవారి కాంప్లెక్స్‌, శివపురం, లడ్డూ కౌంటర్‌ ప్రాంతాలతోపాటు కోరుట్ల బస్టాండ్‌, కట్టకింది బస్టాండ్‌, తిప్పాపూర్‌ బస్టాండ్‌, నాంపెల్లిలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారి డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఆనందభాస్కర్‌, వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T11:57:35+05:30 IST