రాజన్న క్షేత్రంలో మహా మృత్యుంజయ యాగం

ABN , First Publish Date - 2020-03-24T11:35:20+05:30 IST

రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సుదర్శన ధన్వంతరి సహిత మహా మృత్యుంజయయాగం నిర్వహించారు.

రాజన్న క్షేత్రంలో మహా మృత్యుంజయ యాగం

వేములవాడ, మార్చి 23: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సుదర్శన ధన్వంతరి సహిత మహా మృత్యుంజయయాగం నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలా డిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి పీడ తొలగి లోకమంతా సుభిక్షంగా ఉం డాలని కోరుతూ ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు సోమవారం స్వామి వారి కల్యాణ మండపంలో సుదర్శన ధన్వంతరి సహిత మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు.


ఇందులో భాగంగా ప్రధా న అర్చకులు నమిలికొండ ఉమేశ్‌శర్మ, ఈశ్వ రగా రి సురేశ్‌, ఉప ప్రధాన అర్చకుడు గోపన్నగారి నా గన్న, నమిలికొండ రాజే శ్వరశర్మ, దుమాల నాగరా జు, ముఖ్య అర్చకులు దుమాల శ్రీనివాస్‌, అర్చకు లు గోప న్నగారి శివ ప్రసాద్‌, గోపన్నగారి గణేశ్‌, అప్పాల రాజాచంద్ర, వేద పండితులు గర్శకుర్తి శ్రీధరశర్మ, మధు హరీశ్‌ ఆత్రేయ  స్వామివారితో పాటు అనుబంధ ఆలయాలో ప్రత్యేకపూజలు, హో మం నిర్వహించి తదుపరి పూర్ణాహుతి గావించా రు. ఆ లయ ఏఈవో డి.ఉమారాణి, సూపరింటెం డెంట్లు నాగుల మహేశ్‌,  శ్రీరాములు, పరిశీల కు లు భూపతిరెడ్డి, రాజశేఖర్‌, సిబ్బంది, పాల్గొ న్నా రు. లోకకల్యాణార్థం దేవాదాయ శాఖ ఆదేశా లతో సుదర్శన ధన్వంతరి సహిత మహామృత్యుంజయ యాగం నిర్వహించామని అర్చకులు తెలిపారు.  

Updated Date - 2020-03-24T11:35:20+05:30 IST