ఎల్‌ఆర్‌ఎస్‌ను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-12-18T04:56:51+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను నిలిపివేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

సుభాష్‌నగర్‌, డిసెంబరు 17: ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఆంక్షలతో నిర్మాణరంగం పూర్తిగా నిలిచి పోయిందని, తద్వారా దానిపై ఆధారపడి జీవిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై చట్టసభల్లో న్యాయనిపుణు లతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్ల నూతన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం ఒక నమూనా పత్రంలాగా ఆబ్జెక్ట్‌ టైప్‌ ఉందని, ఎస్‌, నో అన్నట్లుగా ఉండడం వల్ల క్రయవిక్రయాల సమయంలో చాలా ఇబ్బందులెదురవుతు న్నాయన్నారు. గతంలో ఉన్న నిబంధనలను ప్రస్తుతం ఎందుకు పొందు పర్చలేదని ప్రశ్నించారు. కేవలం ఒకటి రెండు నిబంధనలు మాత్రమే ఉన్నాయని తద్వారా ఎన్నో ఆటంకాలు ఎదురుకానున్నాయని పేర్కొ న్నారు. ఆస్తి, అమ్మకందారునికి  ఆ ఆస్తి స్వార్జితమా, వారి పూర్వీకుల ద్వారా సంక్రమించిందా అనే వివరాలకు సంబంధించిన ఆప్షన్‌ అందులో లేదని, దానిని పొందుపర్చా లన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వివరాలు తప్పుడుగా ఇస్తే వాటిని ప్రశ్నించే అధికారం లేదన్నారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌  తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఉందన్నారు. ఇంగ్లీష్‌ రాని వ్యక్తికి డాక్యుమెంట్‌లో ఏం రాశారో తెలి యదని, తద్వారా అతడు గుడ్డిగా సంతకం చేయడం వల్ల నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదన్నారు. నాడు ఆంగ్లేయులు జుట్టు పన్ను వసూలు చేసిన విధంగా నేడు కేసీఆర్‌ రిజిస్ర్టేషన్ల పేరుతో పన్ను వసూలుచేసి సామాన్యులపై భారం మోపుతున్నాడని మండిపడ్డారు. పట్ట ణంలో భవనానికి, రేకుల షెడ్డుకు ఒకే విధమైన పన్ను వసూలు చేసే విధంగా నిబంధనలు రూపొందించడం సామాన్యుని నడ్డివిరిచే విధంగా ఉందన్నారు. రిజిస్ర్టేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్‌ హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహ చట్టాలను పరిగణలోకి తీసుకొని రూపొందించాలన్నారు. గతంలో లేనివిధంగా మ్యుటేషన్‌పేరుతో ఎకరాకు 2500రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన నగదు చెల్లింపుల వివరాలు బ్యాంకు ద్వారా అయితే డీడీ నెంబర్‌, వివరాలు పొందుపర్చడం లాంటివి అందులో లేవన్నారు. ఇది ముఖ్యమంత్రి అనాలోచిత విధానమని, మూర్ఖత్వమని విమర్శించారు. న్యాయస్థానం ఆక్షేంపించినప్పటికీ చలనం లేదన్నారు. ధరణిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కొనసాగించాలన్నారు. దీనిపై న్యాయనిపుణులు చట్ట సభలలో చర్చించాలన్నారు. సమావేశంలో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, పద్మాకర్‌ రెడ్డి, సూర రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:56:51+05:30 IST