-
-
Home » Telangana » Karimnagar » Lockdown
-
ఎక్కడి బస్సులు అక్కడే
ABN , First Publish Date - 2020-03-24T11:25:40+05:30 IST
లాక్‌డౌన్‌తో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులన్నీ డిపోలకే పరిమితమ య్యాయి. ఈనెల 31వరకు అన్నిరవాణా వ్యవస్థలను బంద్‌చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మ డిజిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమ య్యాయి.

బస్టాండ్‌లో కరోనా నివారణ చర్యలు
బస్టాండ్‌ను హైపోక్లోరైడ్‌తో శుభ్రం
భగత్‌నగర్, మార్చి 23: లాక్‌డౌన్‌తో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులన్నీ డిపోలకే పరిమితమ య్యాయి. ఈనెల 31వరకు అన్నిరవాణా వ్యవస్థలను బంద్‌చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మ డిజిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమ య్యాయి. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా నైట్ హాల్ట్ బస్సులను రద్దు చేసి డిపోలకు రప్పిం చిన అధికారులు శనివారం రాత్రి నుంచే బస్సులను రద్దు చేశారు. అన్నీ డిపోలకే పరిమితమవడంతో రోడ్లపై ఒక్క బస్సు కూడా కనిపించలేదు. దీనితో ఆర్టీసీ ప్రాంగణం నిర్మానుష్యంగా మారిపోయింది.
బస్టాండ్‌లో కరోనా నివారణ చర్యలు..
సోమవారం బస్టాండ్‌లో నగరపాలకసంస్థ ఆధ్వ ర్యంలో జిల్లా అగ్నిమాపకయంత్రంతో హైపోక్లోరై డ్‌ను పిచికారిచేశారు. బస్టాండ్ ప్రాంతంలోని ప్రయాణికులు కూర్చుండే ప్రాంతంతోపాటు, బస్సులు ఆపేస్థలాలు, కరీంనగర్-1,-2డిపోల్లో నివా రణ చర్యలు చేపట్టారు. బస్టాండ్ ఫ్లోరింగ్‌తో పాటు, కరీంనగర్-1, కరీంనగర్ డిపోల్లో అగ్ని మాపక దళ సిబ్బంది మొత్తం హైపోక్లోరైడ్‌తో శుభ్రపరిచారు. బస్సులన్నీ డిపోల్లో నిలిచిపోవడంతో ఆర్టీసీ సిబ్బంది బస్సులనుపూర్తిగా శుభ్రంచేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.