‘మే 25 వరకు లాక్‌డౌన్ పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం’

ABN , First Publish Date - 2020-04-28T19:24:11+05:30 IST

వచ్చే నెల 25వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి

‘మే 25 వరకు లాక్‌డౌన్ పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం’

మే 25వరకు లాక్‌ డౌన్‌.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు


మెట్‌పల్లి/కరీంనగర్ (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 25వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, శాస్త్రీ చౌరస్తా, మున్సిపల్‌ కార్యాలయాల్లో హైద్రాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు కల్వకుంట్ల సంజయ్‌ సహకారాలతో సుమారు 500 మంది పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి నిత్యావసర సరుకులు జిల్లా కలెక్టర్‌ రవితో కలిసి పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, మెట్‌పల్లి మండలాలకు చెందిన వైద్య, పోలీసు సిబ్బందికి సుమారు రూ. 4.50 లక్షల విలువ గల నిత్యవసర వస్తువు లను పంపిణీ జరిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రణవేని సుజాత, వైస్‌ చైర్మన్‌ బోయినిపల్లి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-28T19:24:11+05:30 IST