-
-
Home » Telangana » Karimnagar » Licenses revoke if drugs are sold at high prices
-
అధిక ధరలకు మందులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు
ABN , First Publish Date - 2020-03-24T11:28:28+05:30 IST
అధిక ధరలకు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని, ఎక్కువ ధరకు అమ్మినట్లు ఏమైనా ఆరోపణలు వస్తే మెడికల్ షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నా రు.

సమయానుకూలంగా షాపులు తెరవాలి
స్టాక్ పాయింట్ ప్రకారం మందులు ఉండాలి
జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అధిక ధరలకు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని, ఎక్కువ ధరకు అమ్మినట్లు ఏమైనా ఆరోపణలు వస్తే మెడికల్ షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నా రు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో మెడికల్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైసెన్స్ ప్రకారం షాపు యాజమానులు సమయానుగుణంగా షాపులు తెరవాలని సూచించారు. ప్రతి మెడికల్ షాపులో స్టాక్ లిస్టు సమర్పించాలని అ న్నారు. అమ్మిన రశీదు ప్రకారం స్టాక్ ఉండా లని, సూచించిన విధంగా లేని షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కోవిడ్-19కు సంబంధించిన స్టాక్ ఉంచుకునే విధంగా చూడాలని, ఏ పరిస్థితుల్లోనైనా ఉన్న ధరకన్నా ఎక్కువ ధరకు మెడిసిన్ విక్రయిం చరాదన్నారు. ఒకవేళ ఆ విధంగా అమ్మినా, అమ్మినట్లు ఫిర్యాదులు వచ్చినా సంబంధిత మెడికల్ షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి మెడికల్ షాపులో ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉండరాదని, అవసరమైతే షిఫ్టువారీగా ఇద్దరు మాత్రమే ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ పాల్గొన్నారు.