పెట్రో ధరలు తగ్గించాలని వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2020-06-26T10:33:02+05:30 IST

పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ నగరంలోని వన్‌టౌన్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకు ఎదుట ప్లకార్డుతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో

పెట్రో ధరలు తగ్గించాలని వామపక్షాల నిరసన

భగత్‌నగర్‌, జూన్‌ 25: పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ నగరంలోని వన్‌టౌన్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకు ఎదుట ప్లకార్డుతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వామ పక్ష పార్టీల నాయకులు గీట్ల ముకుందరెడ్డి, పొనగంటి కేదారి, జిందం ప్రసాద్‌, యు శ్రీనివాస్‌, రమేష్‌, పైడిపల్లి రాజు, సృజన్‌కుమార్‌, అశోక్‌, యుగెందర్‌, మణికంఠరెడ్డి, బుచ్చన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


కరీంనగర్‌ రూరల్‌ : సీపీఎం కొత్తపల్లి జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో పెట్రో ధరల పెంపుపై నిరసన చేపట్టారు. బస్టాండ్‌ నుండి బైక్‌లను తాళ్లతో కట్టి లాగుతూ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుడికందుల సత్యం, కవ్వంపల్లి అజయ్‌, నాయకులు కె రాజు, శ్రీనివాస్‌, మల్లేశం, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-26T10:33:02+05:30 IST