-
-
Home » Telangana » Karimnagar » Launch of RTC Interstate Services in Karimnagar
-
ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-15T05:35:02+05:30 IST
కరీంనగర్ రీజియన్ నుంచి విజయవాడకు పది అంత ర్రాష్ట్ర సర్వీసులను ప్రారం భిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి జీవన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

భగత్‌నగర్, డిసెంబరు 14: కరీంనగర్ రీజియన్ నుంచి విజయవాడకు పది అంత ర్రాష్ట్ర సర్వీసులను ప్రారం భిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి జీవన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 2న రెండు రాష్ట్రాల మధ్య కుది రిన ఒప్పందంలో భాగంగా 149 అంతర్రాష్ట్ర సర్వీసులకు గాను కరీంనగర్ రీజియన్ నుంచి విజయ వాడకు పది సర్వీసులు ప్రారం భిస్తున్నామ న్నారు. ఇందులో 6 సర్వీసులు సూపర్‌లగ్జరీలు, మిగతా నాలుగు సర్వీసులు రాజధాని సర్వీసులు ఉన్నాయన్నారు. కరీంనగర్-1 డిపో నుంచి నాలుగు రాజధా ని సర్వీసులు మంగళవారం నుంచి, మిగతా వేములవాడ నుంచి 2, జగిత్యాల నుంచి 4 సర్వీసులు బుధవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. కరీంనగర్ నుంచి బయలుదేరే ఒక సర్వీసు విజయవాడ మీదుగా ఏలూరు వరకు నడపనున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులకు ముదస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కోసం ఇంటర్‌నెట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు.