అంబరాన్నంటిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST

పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం అంబరాన్నింటింది. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు.

అంబరాన్నంటిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
కోనేరులో ప్రత్యేక అభిషేకం చేస్తున్న అయ్యప్ప స్వాములు, వేదపండితులు

కోరుట్ల, డిసెంబరు 6 : పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం అంబరాన్నింటింది. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. స్థానిక మహదేవస్వా మి ఆలయం వరకు శోభాయాత్ర జరిపి అక్కడ కోనేరులో స్వామి వారికి జలాభిషేకంతో పాటు పంచామృత అభిషేకాలను జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దీక్షాపరు లు, భక్తులు, కళాకారులు నృత్యాలు చేస్తూ స్వామి వారికి స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి క మిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.  

రాయికల్‌ : రాయికల్‌ పట్టణంలో హరిహర సుత అయ్యప్ప ఆరట్టు ఉ త్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. స్థానిక అయ్యప్ప ఆల యంలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఆలయం నుంచి పటేల్‌ విగ్రహం, గాంధీచౌక్‌, పాత బస్టాండ్‌ నుంచి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో మహిళలు మంగళహారతులతో స్వాములకు స్వాగతం ప లికారు. ఉత్సవమూర్తులకు పెద్ద చెరువులో చక్ర స్నానం అనంతరం తిరి గి ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మునుగోటి సత్యనారాయణ శర్మ, సింగని రమేష్‌, మణి, మామిడాల నరేందర్‌, రాకేష్‌, కైరం సత్యం, సతీష్‌ పాల్గొన్నారు.

Read more