ఘనంగా లక్ష్మీనర్సింహుడి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-01T05:46:13+05:30 IST
మండల కేంద్రంలోని ప్రహ్లా దపర్వతంపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

రుద్రంగి, నవంబరు 30: మండల కేంద్రంలోని ప్రహ్లా దపర్వతంపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా రుద్రంగిలో మూడు రోజులపాటు లక్ష్మీ నర్సింహస్వామి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారి తిరు నాళ్లు, గరుఢ సేవ, రాత్రి నిత్య వైష్ణవుల యక్షగానం భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగ కుండా ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతరలో అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో బం దోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తుల కోసం మహాఅన్నదానం ఏర్పాటు చేయగా టీఆర్కే ట్రస్ట్ సభ్యు లు వలంటరీలుగా సేవ చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్ రెడ్డి, సర్పంచ్ తర్రె ప్రభలతమనోహర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఉప సర్పంచ్ గంగమల్లయ్య, మాజీ జడ్పీటీసీ గంగాధర్, ఎంపీటీసీ లావణ్య రాజేశం, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నర్సారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గణేష్, తిరుపతి, నర్సయ్య, సంతోష్‌రెడ్డి, ఆనందం, మహేష్, వెంకటేష్, పూదరి శ్రీనివాస్, కంటె రెడ్డి, నారాయణ, మోహన్‌రెడ్డి, లచ్చిరెడ్డి, దేవేందర్, అభిలాష్, రమేష్, తర్రె లింగం, పెద్దులు, గంగారాజం, దుబ్బ రవి పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న డీఎస్పీ
లక్ష్మీ నర్సింహస్వామి జాతర సందర్భంగా వేముల వాడ డీఎస్పీ చంద్రకాంత్ సోమవారం రాత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్ డీఎస్పీని సన్మానించారు. సీఐలు నవీన్, వెంకటేష్, ఎస్సైలు మహేష్, సునిల్ తదితరులు ఉన్నారు.