-
-
Home » Telangana » Karimnagar » Kondagattu Sri Anjaneyaswamy
-
అంజన్నకు పంచామృత అభిషేకం
ABN , First Publish Date - 2020-03-13T12:08:27+05:30 IST
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధానంలో రెండవ రోజు పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి.

కొండగట్టులో రెండవ రోజు ఘనంగా పవిత్రోత్సవాలు
మల్యాల, మార్చి 12: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధానంలో రెండవ రోజు పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తు లకు ఉపనిషత్తు పారాయణం, వేదపఠనం, మూల విరాట్టుకు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, పంచసూక్త హవనం, మహనివేధన, మంత్రపుష్పం, శాత్తుమొర తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం శ్రీ లక్ష్మీ సహస్రనా మ పారాయాణం, కుంకుమార్చన, ఓడిబియ్యం, హనుమాన్ చాలీ సా పారాయాణలు చేశారు.
అనంతరం మూలమంత్ర హవనం, పవిత్రలకు శయ్య, ఫల, ఽపుష్పాదివాసం, బలిహరణం, నివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఆలయ అ ర్చకులు, వేదపండితులు ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళల్లో భక్తులు సామూహిక భజనలు, రామనామ సంకీన్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కృష్ణప్రసాద్, ఫౌండర్ ట్రస్టీ మారుతీ, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ఆలయ స్థానాచార్యులు జితేం ద్రప్రసాద్, ప్రధాన అర్చకులు మారుతీస్వామి, రామకృష్ణ, అధికా రులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.