భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు

ABN , First Publish Date - 2020-03-04T07:24:57+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధానం మంగళవారం భక్తులతో కిటకి టలాడింది.

భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు

మల్యాల, మార్చి 3: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధానం మంగళవారం భక్తులతో కిటకి టలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఆల యంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంత రం బేతాలుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. భ క్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు శ్రీని వాస్‌శర్మ, రాజేశ్వర్‌రావు, సంపత్‌, సునీల్‌, రాజేంధర్‌రెడ్డి పోలీసు లు పర్యవేక్షించారు. మహిళ భక్తులు కోనేరులో స్నానాలు చేసిన అనంతరం దుస్తులు మార్చుకోవడానికి సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


అంజన్నను దర్శించుకున్న కరీంనగర్‌ సీపీ

 కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని మంగళవారం కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీపీ కి అధికారులు, అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. అనం తరం శ్రీస్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ సీపీని శాలువలతో సత్కరించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్ర మంలో పోలీస్‌, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T07:24:57+05:30 IST