నేటితో పట్టణ ప్రగతి ముగింపు

ABN , First Publish Date - 2020-03-04T11:05:42+05:30 IST

నేటితో పట్టణ ప్రగతి ముగింపు

నేటితో పట్టణ ప్రగతి ముగింపు

- అడ్డా కూలీలతో పరుగులు తీసిన ‘ప్రగతి’

- పది రోజులు రూ.45 లక్షల ఖర్చు 

- సిరిసిల్ల బల్దియాలో కౌన్సిలర్లు, వార్డుసభ్యుల సందడి 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల, వేములవాడ బల్దియాలు శుభ్రత వైపు అడుగులు వేస్తున్నా యి. పది రోజుల పాటు చురుకుగా సాగిన పట్టణ ప్రగతి పనులతో గల్లీల్లో సందడిగా మారింది. జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. వార్డు కమిటీ సభ్యులతో సమావేశమై పనులను గుర్తించి పరిష్కరించే దిశ గా ముందుకు సాగారు. రోడ్డు పక్కన కంప, చెట్లను చెత్త, చెదారాన్ని తొలగించారు. శిథిల మైన గోడలు, విద్యుత్‌ స్తంభాలను మార్చారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా సాగాయి. బుధవారంతో పట్టణ ప్రగతి ముగిసిపోనుంది. పది రోజులపాటు పట్టణ ప్రగతికి సందడి కనిపించింది. రోజు వారీ కూలీల్లో మాత్రం ఆందోళన ఏర్పడింది. పది రోజులపాటు పను ల కోసం ఎదురు చూడకుండా నిత్యం మున్సి పల్‌ వద్దకు వచ్చి పట్టణ ప్రగతి పనుల కు కూలీగా వెళ్లారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 39 వార్డుల్లో ప్రతి రోజు మున్సిపల్‌ సిబ్బంది మినహా 300 మందికి పైగా కూలీలను ఉప యోగించుకున్నారు. మహిళా కూలీకి రూ. 500, పురుషులకు రూ.600 చెల్లించారు. సాధా రణ రోజుల కంటే రూ.200 నుంచి రూ.300 వరకు అదనపు కూలీ లభించింది. దీంతోపాటు 56 ట్రాక్టర్లు, 15 జేసీబీలు, 10 బ్లేడ్‌ ట్రాక్టర్లను ఉపయోగిం చారు. పట్టణ ప్రగతి కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.79 లక్షలు నిధులు కేటాయించగా గడిచిన పది రోజుల్లో కూలీల చెల్లింపులు, ట్రాక్టర్లు, జేసీబీలకు దాదాపు రూ.46 లక్షల వరకు ఖర్చు చేశారు. వేముల వాడ బల్దియాలో కూడా నిత్యం వంద మంది కూలీలను అదనంగా వినియోగించుకున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలను వినియోగించుకున్నారు. 


విలీనం గ్రామాల్లో మార్పులు

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో పట్టణ ప్రగతి ద్వారా మార్పులు వచ్చాయి. పారిశుధ్యం , పచ్చదనం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేశారు. శిథిలా వస్థలో ఉన్న ఇళ్లను, గోడలను తొలగించారు. ఎక్కువగా కూలీలకు పనులను విలీన గ్రామాల్లో చేపట్టారు.


పట్టణ ప్రగతి స్ఫూర్తి కొనసాగాలి  - జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న పట్టణ ప్రగతి స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూ రి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు మురికి కాలువలను పరిశీలించారు. పట్టణ ప్రగతితో వస్తున్న మార్పులపై కలెక్టర్‌ ఆరా తీశారు. పారిశుఽధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇళ్లలోని తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి ప్రతి రోజు ఉదయం మున్సిపల్‌ వాహనాలకు అందించా లని కోరారు. రోడ్లపై చెత్తను పారవేస్తే జరిమా నాలు విధిస్తామని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పట్టణ ప్రగతిలో పనిచేయాలన్నారు. 


Updated Date - 2020-03-04T11:05:42+05:30 IST