-
-
Home » Telangana » Karimnagar » Killing someone for chicken legs pedapalli
-
కోడి కాళ్ల కోసం ఒకరి హత్య
ABN , First Publish Date - 2020-12-15T05:47:40+05:30 IST
మద్యం సేవించి కోడి కాళ్ల కోసం తోటి కార్మికులతో గొడవ పడ్డ వ్యక్తిని హత్య చేసి శ్మశాన వాటికలో దహనం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనుమానం రాకుండా కరీంనగర్ శ్మశాన వాటికలో దహనం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పెద్దపల్లి టౌన్, డిసెంబరు 14: మద్యం సేవించి కోడి కాళ్ల కోసం తోటి కార్మికులతో గొడవ పడ్డ వ్యక్తిని హత్య చేసి శ్మశాన వాటికలో దహనం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆరుగురిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. సోమవారం పెద్దపల్లి డీసీపీ రవీందర్ విలేకరుల సమావేశంలో వి వరాలను వెల్లడించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో గల ఓ ఇటుక బట్టీలో పని చేసేందుకు నాలుగు మాసాల క్రితం ఒడిషా రాష్ట్రం సంద రంఘడ్ జిల్లా సునాపర్వత్ గ్రామానికి చెందిన బసు జోర, పూజ లుంగీ యార్, బీమ్సన్ జోరా, బయా లుంగీయార్ అనే నలుగురు వ్యక్తులు వచ్చారు. ప్రతి బుధవారం కార్మికులంతా మధ్యాహ్నాం పెద్దపల్లి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఇతర కిరాణ సరుకులు తీసుకుని వస్తుంటారు. అందులో భాగంగా సదరు నలుగురు కార్మికులు ఈ నెల 9న పెద్దపల్లి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలతో పాటు చికెన్ సెంటర్‌లో కోడి కాళ్లు, పేగులు తీసుకుని వారు పని చేసే ఇటుక బట్టీల నివాస ప్రాంతానికి వెళ్లారు. రాత్రి వరకు వంట చేసుకున్నారు. కాల్చిన కోడి కాళ్లు, పేగుల విషయమై బీమ్సన్ జోరా మద్యం మత్తులో తోటి కార్మికులతో గొడవపడ్డాడు. ప్రతీసారి గొడవ జరుగుతు న్నదని భావించిన బసు జోర, పూజ లుంగీయార్, బయా లుంగీయార్ పందిరికి ఉన్న దొడ్డు కర్ర తీసుకుని బీమ్సన్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయమై కార్మికులు ఇటుక బట్టీ యజమా నులు ఈసారపు శ్రావణ్, మేకల మహేష్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్‌ఎంపీని పిలింపించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా పరిస్థితి విష మంగా ఉండడంతో పెద్దపల్లిలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంన గర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బీమ్సన్ మృతి చెందాడు. మృతదేహా న్ని పెద్దపల్లికి తీసుకుపోతే పట్టుబడతామని భావించి, ఇటుక పెళ్లలు పడి చనిపోయాడని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకువచ్చి కరీం నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీమ్సన్ చితికి పూజ లుంగీయార్ నిప్పంటించారు. డెత్ సర్టిఫికెట్ తీసుకువచ్చేందుకు మరో ఇటుక బట్టీ ఓనర్ అంబటి సతీష్ సహకరించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోటా పొక్కడంతో గీతం శ్రీనివాస్ అనే వ్యక్తి బసంత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘ టనపై విచారణ జరిపి బసుజోర, పూజా లుంగీయార్, బయా లుంగీయార్, ఈసారపు శ్రావణ్, మేకల మహేష్, అంబటి సతీష్‌లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. విలేకరుల సమా వేశంలో ఏసీపీ ఉమేష్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐలు జానీ పాషా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.