కేసీఆర్‌ది నియంతృత్వ పాలన

ABN , First Publish Date - 2020-12-12T04:57:20+05:30 IST

సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొనసాగి స్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు స్పష్టం చేశారు.

కేసీఆర్‌ది నియంతృత్వ పాలన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రదీప్‌రావు

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 11: సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొనసాగి స్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు స్పష్టం చేశారు. స్థానిక అమర్‌చంద్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టాన్ని తండ్రీకొడుకులు ఏలుతున్నారన్నారని, ఎ న్నికల ముందు ఎన్నో వాగ్ధానాలు చేసి గాలికి వదిలేశారన్నారు. ప్రభుత్వంపై ఉ ద్యోగులు, కార్మికులు, అధికారులు అన్ని వర్గాల్లో నిరాశే ఉందన్నారు. రానున్న రో జుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అక్కడి విలేకరిని ఫోన్లో దూషించడాన్ని తీవ్రంగా ఖం డించారు. ఇప్పటికి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు లను సన్నరకం వరిధాన్యం పండించాలని సూచించిన కేసీఆర్‌ కొనుగోలు చేయ డంలో విఫలమయ్యాడని వివరించారు. సమావేశంలో అమరగాని ప్రదీప్‌, తం గెడ రాజేశ్వర్‌రావు, శిలారపు పర్వతాలు, బెజ్జెంకి దీలిప్‌, రాజం మహంతకృష్ణ, ఎర్రోళ్ళ శ్రీకాంత్‌, ఉప్పు కిరణ్‌, వొల్లె తిరుపతి, వేల్పుల రమేష్‌, సంపత్‌, రమేష్‌, రాజన్న, ప్రభాకర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-12-12T04:57:20+05:30 IST