రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2020-09-12T11:10:34+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కటకం మృత్యుంజయం అన్నారు. మండల ..

గంభీరావుపేట, సెప్టెంబరు 11: తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కటకం మృత్యుంజయం అన్నారు. మండల కేం ద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిజాలను వెలికితీస్తే నిరంకుశంగా తొక్కిపారేస్తున్నారని, దోపిడీని ప్రశ్నిస్తే అరెస్ట్‌లు, అక్రమ కేసులు పెడుతున్నారని మండి పడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. రాష్ట్రంలో మం త్రుల పర్యటన ఎక్కడున్నా ముందుగా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడంతో ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమవుతోందన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంటలకు సాగునీరివ్వకుండా మొదక్ జిల్లాకు తరలించడం సిగ్గుచేటన్నారు. కొత్త చట్టాల పేరుతో ఉన్న ఉద్యో గులను తొలగించడం అన్యాయమని, పోలీస్ శాఖలో తప్ప ఏ శాఖలో ఇంత వరకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజల సొమ్మును పరోక్షంగా రాబట్టుకోటానికి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ జీవో తెచ్చి ందన్నారు. 131 జీవోను తక్షణమే రద్దుచేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి పరిహారం అందించాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.