మొక్కల పెంపకంలో కరీంనగర్‌ పోలీసులు ఆదర్శం

ABN , First Publish Date - 2020-07-22T10:41:58+05:30 IST

మొక్కల పెంపకంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆదర్శమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లా పర్యటనలో

మొక్కల పెంపకంలో కరీంనగర్‌ పోలీసులు ఆదర్శం

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌


కరీంనగర్‌ క్రైం, జూలై 21: మొక్కల పెంపకంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆదర్శమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కరీంనగర్‌ పోలీసుశిక్షణ కేంద్రంలోని మియావాకి చిట్టడవుల పెంపకాన్ని మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌, సీపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ పోలీసుల ఆధ్వర్యంలో పెంచుతున్న చిట్టడవుల పెంపకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు.


కరీంనగర్‌ సీపీటీసీలోని మియావాకీ మాదిరిగానే యాదాద్రి ఫారెస్ట్‌ మోడల్‌గా నామకరణం చేసి చిట్టడవుల పెంపకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి పట్టుదల, కృషి ద్వారానే ఇది సాధ్యమైందని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలించేందుకు వస్తానని మంత్రి కేటీఆర్‌ సీపీతో అన్నారు. కలెక్టర్‌ కె శశాంక, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, సీపీటీసీ ప్రిన్సిపాల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, మేయర్‌ వై సునీల్‌ రావు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-22T10:41:58+05:30 IST