-
-
Home » Telangana » Karimnagar » Karimnagar police are ideal for other districts
-
కరీంనగర్ పోలీసులు ఇతర జిల్లాలకు ఆదర్శం
ABN , First Publish Date - 2020-12-29T04:51:42+05:30 IST
కరీంనగర్ పోలీసులు చాటుతున్న సమర్ధత, అంకితభావాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి
కరీంనగర్ క్రైం, డిసెంబరు 28: కరీంనగర్ పోలీసులు చాటుతున్న సమర్ధత, అంకితభావాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ పోలీస్‌కమిషనరేట్లు, జిల్లాలకు చెందిన అధికారులతో నేరాల ఛేదన పురోగతితోపాటు పలుఅంశాలపై సోమ వారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాపోలీసులు విధినిర్వహణ పట్ల అంకితభావాన్ని, ఛేదనలో సమర్ధతను చాటుతూ పోలీస్‌శాఖ ప్రతిష్ఠను పెంపొందిస్తున్నారని అభినందించారు. కరీంనగర్ పోలీస్‌కమిష నర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ నేరాల ఛేదన, నియంత్రణే లక్ష్యంగా ముందుకు సాగుతుండటం వల్లనే తమకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభిస్తున్న దన్నారు. ఇదే నూతనోత్సాహం కొనసాగిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జీ చంద్రమోహన్, సిటీ ఏసీపీ పీ అశోక్, సీఐలు పాల్గొన్నారు.