వైభోగం.. కల్యాణం..!

ABN , First Publish Date - 2020-03-15T06:49:46+05:30 IST

జిల్లా కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేం ద్ర స్వామి ఆలయంలో శనివారం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. చతుర్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని....

వైభోగం.. కల్యాణం..!

జగిత్యాల టౌన్‌, మార్చి 14: జిల్లా కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేం ద్ర స్వామి ఆలయంలో శనివారం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. చతుర్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ఆలయంలో సుప్రభా తం, వేదపఠనం నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వ ర్యంలో స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తు లు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్ది యా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ, పీఠాధిపతి చంద్ర మౌళేశ్వర స్వామి హాజరై కల్యాణాన్ని తిలకించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంకోజి వెంకట రమణ, నాంపెల్లి రామ స్వామి, మద్దెలపల్లి సత్యనా రాయణ, టీవీ సత్యం, పడకంటి ఆనందం పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T06:49:46+05:30 IST