వన నర్సరీల పెంపకంలో నిర్లక్ష్యాన్ని సహించం

ABN , First Publish Date - 2020-03-15T06:41:41+05:30 IST

వనర్సరీల పెంప కంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌కు...

వన నర్సరీల పెంపకంలో నిర్లక్ష్యాన్ని సహించం

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్‌

ఎలిగేడు, మార్చి 14: వనర్సరీల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌కు మార్‌ హెచ్చరించారు. మండలంలోని బుర్హా న్‌మియాపేట, సుల్తాన్‌పూర్‌, లోకపేట, ము ప్పిరితోట, ధూళికట్ట, నర్సరీలను పరిశీలించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుర్హాన్‌మియా పేట నర్సరీని పరిశీలించి ఫెన్సింగ్‌ గేట్‌, బోర్డు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సుల్తాన్‌పూ ర్‌ నర్సరీలో ఉన్న మొక్కల బెడ్స్‌ లెక్కించారు. వనసేవక్‌తో మాట్లాడారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వైకుంఠదామాన్ని పరిశీలించా రు. ధూళికట్ట నర్సరీలో ప్రైమరీ బెడ్స్‌లో మొలకెత్తిన మొలకల్ని చిన్న బ్యాగుల్లో ఎత్తుకోవా లని ఫెన్సింగ్‌ ఏర్పాటు అనివార్యమన్నారు.


ముప్పిరితోట నర్సరీలో కన్వర్షన్‌ పూర్తి కాకపో వడంతో కూలీలు తక్కువ రావడం గురించి సర్పంచ్‌, జీపీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లోకపేట నర్సరీలో సీడ్‌ డబ్లింగ్‌ చేయించాలని, ఇంకా మిగిలిన ప్రైమ రీ బెడ్‌లలో పూలమొక్కల విత్తనాలు నాటు కోవాలని సూచించారు. రెండు రోజుల్లో పను లను పూర్తి చేయాలని, అలాగే వైకుంఠదా మాలు మార్చి చివరి వరకు పూర్తికావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీని వాసమూర్తి, ఏపీఎం సుధాకర్‌, ఎంపీఓ అని ల్‌రెడ్డి, ఏపీఓ సదానందం, సర్పంచ్‌లు ఆర్‌కే రాజా, అర్శనపల్లి వెంకటేశ్వర్‌రావు, గొల్లె కా వేరి, పెద్దొళ్ల ఐలయ్య, దేవరనేని ప్రభావతి, జీపీ కార్యదర్శులు ఆసియా, మల్లేశం, అబి జిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T06:41:41+05:30 IST