ఎన్టీపీసీలో ఈఎస్‌ఐ బ్రాంచ్‌ కార్యాలయం

ABN , First Publish Date - 2020-03-15T06:43:04+05:30 IST

కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) బ్రాంచ్‌ కార్యాలయాన్ని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో..

ఎన్టీపీసీలో ఈఎస్‌ఐ బ్రాంచ్‌ కార్యాలయం

  • రామగుండం నుంచి తరలింపు
  • ఈనెల 16 నుంచి సేవలు 

జ్యోతినగర్‌, మార్చి 14 : కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) బ్రాంచ్‌ కార్యాలయాన్ని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఏర్పాటు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా రామగుండం పట్టంలో ఉన్న ఈఎస్‌ఐ బ్రాంచ్‌ ఆఫీసును శాలపల్లి రోడ్డు(కృష్ణాగనర్‌)లో అద్దె భవనంలోకి తరలించారు. ఈనెల 16 సోమవారం నుంచి కొత్త ఈఎస్‌ఐ కార్యాలయంలో కార్మికులకు సేవలందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని అసంఘటిత కార్మికులకు ఈ ఈఎస్‌ఐ బ్రాంచ్‌ కార్యాలయంలో ఆర్థికపరమైన సేవలు(బిల్స్‌) అందిస్తారు. సిక్‌ బిల్స్‌, మెడికల్‌ బిల్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితర 15 రకాల ఆర్థిక సంబంధ సేవలను ఈ ఆఫీసు నుంచి కార్మికులకు అందుతాయి.


ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ బ్రాంచ్‌ కార్యాలయంలోనే ఒకటి, రెండు నెలల్లో డిస్పెన్సరీ(వైద్య శాల)ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, వేలాది మంది కార్మికులు గతంలో మారుమూలలో ఉన్న ఈఎస్‌ఐ ఆఫీసుకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎన్టీపీసీ రాజీవ్‌ రహదారికి కూతవేటు దూరంలో కొత్త కార్యాలయం రావడంతో దూరప్రాంతం నుంచి వచ్చే కార్మికులకు సులువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీకి కార్యాలయాన్ని తరలించడంపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-15T06:43:04+05:30 IST