మున్సిపల్‌ బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-03-15T06:40:18+05:30 IST

మున్సిపాలిటీల్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను సమర్థవంతంగా విని యోగించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో...

మున్సిపల్‌ బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి

  • ప్రణాళికాబద్ధంగా పారిశుధ్య పనులు చేపట్టాలి 
  • ప్రత్యేక బడ్జెట్‌ సమావేశంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

సుల్తానాబాద్‌ మార్చి 14: మున్సిపాలిటీల్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను సమర్థవంతంగా విని యోగించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ప్రత్యేక బడ్జెట్‌ సమావేశంలో ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్‌ నిర్వహించారు. పట్టణ ప్రగతిలో సూచించిన విధంగా అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆమె కోరారు. పారిశుధ్య ప్రణాళిక ప్రకారంగా మున్సిపాలిటీలలో పారిశుధ్య నిర్వహణ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో క్షేత్రస్థా యిలో కౌన్సిలర్లు చెత్త నిర్వహణ తడి, పొడి చెత్త వేరే చేయడం ప్లాస్టిక్‌ నిషేదం అంశాలపై అవగా హన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 


సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.16.48 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.74 లక్షలు సిబ్బంది జీతభత్యాలు, పారిశుద్య సిబ్బంది కూలీలకు, రూ.28.60 లక్షలు పారిశుద్య నిర్వహణకు రూ.66 లక్షలు విద్యుత్‌ చెల్లింపులు, రూ.2 లక్షలు వడ్డీ చెల్లింపులు, రూ.35 లక్షలు గ్రీన్‌ బడ్జెట్‌, రూ.42.50 లక్షలు ఇంజనీరింగ్‌ విభాగం, రూ.28.3 లక్షలు సాధారణ నిర్వహణ, రూ.3 లక్షలు టౌన్‌ప్లానింగ్‌కు కేటాయించారు. చార్జ్‌డ్‌, ఇతర నిర్వహణ పద్దులకు అవసరమైన నిధులు కేటా యించిన తరువాత నూతన పురపాలక చట్టం ప్రకారం మిగిలిన బడ్జెట్‌లో 1/3  విలీన గ్రామాల మౌళిక సదుపాయాల కల్పనకు రూ.39.65 లక్షలు, పార్కులు, వైకుంఠదామాల నిర్మానం, ఇతర పను లకు రూ.8 లక్షలు, వార్డుల్లో అభివృద్ధి పనులకు రూ.18 లక్షలు కేటాయించారు.


క్యాపిటల్‌ ప్రాజెక్టు ఫండ్స్‌ కింద సుల్తానాబాద్‌ మున్సిపాలిటీకి రూ.12.23 కోట్లు వివిధ గ్రాంట్ల క్రింద సమకూరు తాయని అంచనా వేస్తూ రూ.12.23 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేశారు. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షల ఆదాయపన్ను, రూ.12లక్షల అస్డెన్‌ రెవెన్యూ, రూ.61.58 లక్షల పన్నేతర ఆదాయం వచ్చిందని, మొత్తం 70.45 లక్షల రెవెన్యూ వ్యయం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ పట్టణాలల్లో పారిశుద్యం పచ్చ దనం పెంపొందిస్తూ ప్రజలకు అవసరమైన కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ పకడ్బందీగా నూతన పురపాలక చట్టం అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు, ప్రజాప్రతినిధులకు నూతన పురపాలక చట్టం కల్పించిందని, దీనిని గుర్తు చేసు కుంటూ అందరు పని చేయాలని ఆయన కోరారు. వంద శాతం ఆస్తి, ఇతర పన్నులు వసూలు చేసి పట్టణ అభివృద్ధిలో సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్‌ లక్ష్మినారాయ ణ, మున్సిపల్‌ చైర్మన్‌ సునిత, వైస్‌చైర్మన్‌ బిరుదు సమత, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, కౌన్సి లర్లు తదితరులు పాల్గొన్నారు.


పెద్దపల్లిలో..

 పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి మున్సి పాలిటీ సమావేశ మందిరంలో శనివారం 2020-21 సంవత్సరానికి రూ.65.10కోట్ల ఆదాయం, రూ.65.10 కోట్లవ్యయంతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. రూ.14.93 కోట్ల ఆదాయం సాధారణ నిధులు, పన్నుల ద్వారా సమకూరుతుందని, రూ.49.75 కోట్లు వివిధ గ్రాం ట్ల కింద వస్తుందని అంచనా వేశారు. జీతాలు, ఈ పీఎఫ్‌, ఈఎస్‌ఐలకు రూ.2.97 కోట్లు, పారిశుద్య నిర్వహణ రూ.1.29కోట్లు, కరెంటు చార్జీలు రూ.1.73 కోట్లు, రుణాల చెల్లింపుకు రూ.1.40 కోట్లు, పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌ రూ.1.53కోట్లు, ఇతర నిర్వహణ వ్యయం కింద రూ.4.15కోట్లు నిధులను కేటాయిం చారు. చార్జిడ్‌, ఇతర నిర్వహణ పద్దులకు అవస రమైన నిధులు కేటాయించిన తరువాత మిగిలిన బడ్జెట్‌లో 1/3 విలీన గ్రామాల మౌళిక సదుపాయాలకు రూ.75.8 లక్షలు, పార్కులు రూ.7.50 లక్షలు, వైకుంఠదామాల నిర్మాణం రూ.12.50 లక్షలు, పబ్లిక్‌ టాయిలెట్లు ఊ.11 లక్షలు, మార్కెట్‌ నిర్మాణానికి రూ.15 లక్షలు, ఆధునిక జంతు వధశాల నిర్మాణం రూ.7.50 లక్షలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం రూ. 9.50 లక్షలు, వార్డుల అభివృద్ధి పనులకు రూ. 86.45 లక్షలను కేటాయించారు.


పెద్దపల్లి మున్సి పాలిటీకి క్యాపిటల్‌ ప్రాజెక్టు ఫండ్స్‌ కింద రూ. 49.75 కోట్లు వస్తాయని అంచానతో వాటిని విని యోగించుకునేందుకు కేటాయింపులు చేశారు. 2018-19 సంవత్సరానికి రూ.2.75 కోట్లు, రూ.88.9 లక్షల అసైన్డ్‌ రెవెన్యూ రూ.3.23 కోట్ల పన్నేతర ఆదాయం లభించింది. మొత్తం రూ.5.86 కోట్ల రెవె న్యూ వ్యయం జరిగిందని వివరించారు.

Updated Date - 2020-03-15T06:40:18+05:30 IST