అంతటా అప్రమత్తం

ABN , First Publish Date - 2020-03-08T07:01:28+05:30 IST

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా జగిత్యాలలో లేదని తెలి యడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తెలం గాణలో అక్కడక్కడ కరోనా వ్యాధి లక్షణాలు...

అంతటా అప్రమత్తం

  • కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో అధికారుల అవగాహన
  • మాస్క్‌, హ్యాండ్‌వాష్‌ వెంట తెచ్చుకోవాలని విద్యార్థులకు ఆదేశాలు
  • ఇప్పటికీ జిల్లాకు రాని మాస్క్‌లు
  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేట్‌ మెడికల్‌ షాపులు
  • ఒక్కో మాస్క్‌ ధర రూ.30కి పెంచి అమ్మకాలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా జగిత్యాలలో లేదని తెలి యడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తెలం గాణలో అక్కడక్కడ కరోనా వ్యాధి లక్షణాలు బయట పడుతున్నారని ప్రచారం సాగగా, జగిత్యాల ప్రాం తంలోని దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి వ్యాధి లక్షణా లు ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్త జిల్లావ్యాప్తంగా కలకలం రేపగా, గాంధీ ఆస్పత్రిలో ఆయనకు కరోనా లేదని నెగెటివ్‌ రిపోర్ట్‌ కావడంతో జిల్లా ప్రజలకు ఊరట కలిగినట్లయింది. అయితే ప్రభుత్వం కరోనా వ్యాధి రాకుండా చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు జిల్లాకు మాత్రం మాస్క్‌లు రాలేదు. జిల్లా కలెక్టర్‌ జి.రవి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


  పెరిగిన మాస్క్‌ల ధరలు

జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాధి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసింది. ఎక్కడ చూసినా కరోనా వ్యాధి గురించే ప్రజలు ముచ్చటించుకుంటున్నారు.  జగిత్యాలలో కూడా కరోనా వచ్చిందంటూ సోషల్‌ మీడి యాలో వైరల్‌ కావడంతో ప్రజలు ఎక్కడ చూసినా మాస్క్‌లు పెట్టుకోవడం కనిపించింది. అయితే ప్రభు త్వం కరోనా వ్యాధి నివారణకు తగు చర్యలు తీసు కుంటున్నా అధికారికంగా జిల్లాకు మాస్క్‌లు పంప లేదు. అక్కడక్కడా ఆస్పత్రుల్లో ఉన్న మాస్క్‌లు వైద్యులకే సరిపోవడం లేదు. దీంతో ప్రజలు ముందు జాగ్రత్తగా మాస్క్‌లు కొనుగోలు చేయడం కనిపించింది.


ఇదే అదునుగా భావించిన  మెడికల్‌ షాపుల యాజ మానులు మాస్క్‌లకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఒక్కో మాస్క్‌ ధర హోల్‌సేల్‌లో రూ.2.50 ఉండగా, గతంలో దానిని రూ.5కు రిటేల్‌లో విక్రయిస్తుండేవారు. ఇప్పుడు ఏకంగా హోల్‌సేల్‌ ధర రూ.10కి చేరుకోగా, రిటేల్‌లో రూ.30కి విక్రయిస్తున్నారు. అయినా సరిపడా లభించడం లేదు. మాస్క్‌లు అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే గోపులాపూర్‌కు చెందిన లైశెట్టి శ్రీహరికి కరోనా లేదంటూ గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆయన పక్షం రోజుల పాటు మందులు వాడాలంటూ సూచించారు. 


జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు

జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాధిపై విస్తృతంగా అవ గాహన కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ జి.రవి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి శ్రీధర్‌ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఆశ వర్క ర్లతో పాటు ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరుగుతూ కరోనా వ్యాధి లక్షణాలతో పాటు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యా జమాన్యాలు విద్యార్థి వెంట మాస్క్‌తో పాటు హ్యాండ్‌ వాష్‌, సానిటైజర్‌ తెచ్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో సానిటైజర్‌తో పాటు హ్యాండ్‌ వాష్‌ల ధరలు పెరిగాయి. జిల్లాలో కొరత ఏర్పడగా, కొందరు ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకుంటున్నారు.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

- పి.శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో ఎక్కడా కరోనా వ్యాధి లేదు. ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధి రాకుండా ముం దు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం మంచిది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - 2020-03-08T07:01:28+05:30 IST