వైభవంగా మల్లన్న బోనాల జాతర
ABN , First Publish Date - 2020-03-16T11:50:17+05:30 IST
వైభవంగా మల్లన్న బోనాల జాతర
- వేలాది సంఖ్యలో హాజరైన భక్తులు
- కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
- వేలాది సంఖ్యలో హాజరైన భక్తులు
మెట్‌పల్లి రూరల్, మార్చి 15: మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ మల్లన్న దేవాలయంలో ఆదివారం బోనాల జాతర వైభవంగా జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం మల్లన్న స్వామికి బోనాలను సమర్పిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి నెత్తెన పెట్టుకొని ఆలయం చుట్టు బోనాలతో భక్తులు ప్రదక్షణలు చేసి మొక్కులను చెల్లించుకున్నారు. మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చిరు. సుమారు 60వేల మంది బోనాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతు రాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. యాదవుల ఆరాధ్యదైవమైన మల్లన్నస్వామిని గొర్రెపిల్లలను అందజేసి మా కుంటుబాన్ని కాపాడుంటు మొక్కులను చెల్లించుకున్నారు. కాగా ఇక్కడ ప్రత్యేక ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కుల మతాలకు అతీతంగా తమ ఇళ్లలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. జడ్పీటీసీ కాటిపెల్లి రాధ-శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని స్వామి వారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మల్లన్న స్వామి ఉత్సవమూర్తితో రథోత్సవం నిర్వహించారు. ఈ జాతరకు వచ్చిన భక్తులకు ముస్లింలు మంచి నీటిని అందజేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనాలు జరగకుండా కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరపు రవి, ఉపసర్పంచ్ పోతుగంటి గంగాధర్, ఎంపీటీసీ తేలుకంటి శంకరయ్య, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చేపూరి జీవన్ రెడ్డి, ఆలయాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మెరుగు దశగౌడ్, ఉపాధ్యక్షులు చేపూరి రాజారెడ్డి, దోతుల రమేష్, ఆలయ కమిటీ ధర్మకర్తలు తేలుకంటి లక్ష్మి-గంగాధర్, సామ శ్రీనివాస్ రెడ్డి, పాలక వర్గం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువజన సంఘాల సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు