తెలంగాణలో రంగును బట్టి రాజకీయాలు చెయ్యం: వినోద్

ABN , First Publish Date - 2020-12-30T17:37:18+05:30 IST

బీజేపీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రంగును బట్టి రాజకీయాలు చెయ్యం: వినోద్

కరీంనగర్: బీజేపీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రంగును బట్టి రాజకీయాలు చెయ్యమని... నల్లోడా, తెల్లోడా అని చూడమన్నారు. కుల మత రాజకీయాలు ఇక్కడ ఉండవని స్పష్టం చేశారు. మత రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు. అమెరికాలో ఇప్పటికే జాతి వివక్ష ఉందని...యూరప్ దేశాల్లోనూ ఇదే కథ నడుస్తోందని చెప్పారు. తెలంగాణలో వర్ణం చూసి రాజకీయం చెయ్యమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేరు ఎత్తకుండా అభివృద్ధిపైనా వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

Updated Date - 2020-12-30T17:37:18+05:30 IST