ఆడబిడ్డలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మి
ABN , First Publish Date - 2020-12-17T05:41:41+05:30 IST
నిరుపేద ఆడబిడ్డలను ఆదుకునేందు కే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్
చెక్కులను అందించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్
జగిత్యాల టౌన్, డిసెంబరు 16: నిరుపేద ఆడబిడ్డలను ఆదుకునేందు కే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలాని కి చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.48 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సం జయ్‌కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత అందజేశారు. అనంతరం వారు మా ట్లాడుతూ పెళ్లైన ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.లక్షా 116 అం దిస్తున్నట్లు వివరించారు. జగిత్యాల మండలంలోని పలు గ్రామాలకు చెం దిన 46 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.9 లక్షల 83 వేల విలువ గల సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఉప్పరి పే టలో బుధవారం రూ. 10 లక్షల చొప్పున నిధులతో నిర్మించిన వెలమ, యాదవ సంఘాల వైకుంఠధామాలను బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావ ణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం కండ్లపెల్లి చెరువు ను పరిశీలించి శిఖం భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అనంతరం మెట్‌పల్లికి చెందిన ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జి ల్లా కేంద్రానికి బాడీ ఫ్రీజర్‌ను అందించారు. అలాగే జగిత్యాల మండలం మోతె శివారులోని సర్వే నెం.107లో మట్టి తవ్వకాలతో కుంట ఏర్పడగా, జీవనోపాధి నిమిత్తం చేపల పెంపకానికి ఈ స్థలాన్ని కేటాయించాలని కో రుతూ ముదిరాజ్ కులస్థులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు న క్క జీవన్, సుల్తానా, మల్లిఖార్జున్, రాజ్‌కుమార్, నవీన్, గంగమల్లు, జ గదీశ్, ఎంపీపీ గంగారాంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సం దీప్‌రావు, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు పాల్గొన్నారు.
రాయికల్ : మండలంలోని కుమ్మరిపెల్లి గ్రామానికి చెందిన పారుపల్లి శ్రీధర్‌కు మంజూరైన రూ.26 వేల విలువ గల చెక్కును బుధవారం ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేణు, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, సాయగౌడ్, స్వామి రెడ్డి, వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.