జనతా కర్ఫ్యూ సక్సెస్‌

ABN , First Publish Date - 2020-03-23T10:50:03+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనతా క ర్ఫ్యూను జిల్లా ప్రజలు విజయవంతం చేశారు. పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌ ప ట్టణాలు, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి, అంతర్గాం, కా ల్వశ్రీరాంపూర్‌, ..

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

ఇళ్లకే పరిమితమైన జనం

ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజాము వరకు గృహాల్లోనే

నిర్మానుష్యంగా మారిన పట్టణాలు, గ్రామాలు

ఎక్కడి వాహనాలు అక్కడే నిలుపుదల

కర్ఫ్యూ నేథప్యంలో జరగాల్సిన పెళ్లి వాయిదా

కరోనా నివారణ కోసం శ్రమిస్తున్న వారికి చప్పట్లతో కృతజ్ఞతలు 

సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో మార్మోగిన జిల్లా


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనతా క ర్ఫ్యూను జిల్లా ప్రజలు విజయవంతం చేశారు. పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌ ప ట్టణాలు, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి, అంతర్గాం, కా ల్వశ్రీరాంపూర్‌, ఓదెల, కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తా రం మండలాలోని జనం ఎవరు కూడా ఉదయం 6 గం టల నుంచి తెల్లవారు జామున వరకు ఇళ్ల నుంచి ఎవ రు కూడా బయటకు రాలేదు. స్వచ్చందంగా జనతా క ర్ఫ్యూను పాటించారు. దీంతో ప్రధాన రహదారులు, వీ ధులు అన్ని నిర్మానుష్యంగా మారాయి. ఒక రోజుకు సరి పడా సరుకులను మందుస్తుగానే తెచ్చిపెట్టుకున్న జనం ఇళ్లకే పరిమితయ్యారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లను నిలిపివే యడంతో బస్టాండు, రైల్వే స్టేషన్లకు ఎవరు రాలేదు. ఆ టోలు, ఇతరత్రా ట్యాక్సీ వాహనాలను కూడా స్వచ్ఛందం గా నిలిపివేశారు.


ముత్తారం మండల హరిపురం గ్రా మంలో ఈరోజు జరగాల్సిన పెళ్లిని మండల అధికారులు గ్రామసర్పంచ్‌ వధూవరుల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని వాయిదా వేయించారు. మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ప్రజలు ఎవరు బయటకు వెళ్లకుం డా ప్రఽధాన రహదారి వద్ద ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను అడ్డం గా పెట్టారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్‌ అ య్యాయి. కర్ఫ్యూ సందర్భంగా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌ అధికారులు సిబ్బందిచే వీదులు అన్నింటినీ కెమికల్స్‌తో శుభ్రం చేయించారు. పోలీసులు ఇతర అధికారులు కర్ఫ్యూను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 6 గంట ల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పాటిస్తున్నామని పలువురు పేర్కొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పుట్ట మధుకర్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి కర్ఫ్యూను పాటించారు. రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ మమ తారెడ్డి, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సునిత, జడ్పీటీ సీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధులు అందరూ పరిమితమై తగు సూచనలు చేశారు.


చప్పట్లతో కృతజ్ఞతలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, మున్సిప ల్‌ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మీడి యా సిబ్బందికి కృతజ్ఞత భావంగా సాయంత్రం 5 గం టలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజలు చప్పట్లు కొట్టి కృజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కుటుంబసభ్యులు క్యాం పు ఆఫీసులో, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనా రాయణ కమిషనరేట్‌లో, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తమ ఇళ్ల వద్ద, ఎమ్మెల్యే దాసరి మ నోహర్‌రెడ్డి కుటుంబసభ్యులు, పెద్దపల్లిలో డీసీపీ రవీం దర్‌, ఏసీపీ హబీబ్‌ఖాన్‌, ఆర్డీఓ శంకర్‌ కుమార్‌, ఆయా శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసులు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖనిలో ప్రభుత్వ వైద్యులు సిబ్బందికి పోలీసు అధికారులకు సి బ్బందికి పట్టణ ప్రజలు చప్పట్లు కొట్టడంతోపాటు పువ్వు లు ఇచ్చి కృతజ్ఞతభావం ప్రకటించారు. 

Updated Date - 2020-03-23T10:50:03+05:30 IST