అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఎంపీ

ABN , First Publish Date - 2020-12-27T05:02:00+05:30 IST

భారతీయ సంస్కృతి, సంప్రదాయలు, కట్టు, బొట్టుపై ఎంపీ అరవింద్‌ అవగాహ న లేకుండా మాట్లాడుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఎంపీ
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ వసంత

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 26 : భారతీయ సంస్కృతి, సంప్రదాయలు, కట్టు, బొట్టుపై ఎంపీ అరవింద్‌ అవగాహ న లేకుండా మాట్లాడుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శనివారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.   జాగృ తి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఇటీవల ఎంపీ అర వింద్‌ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవితక్కపై విమర్శలు చేస్తే ఊరుకోమని, రాష్ట్రంలోని మహిళలందరం ఏకమై అరవింద్‌ను తెలంగాణలో తిరగ నివ్వమని హెచ్చరించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఓటర్లకు మాయ మాటలు చెప్పి గెలిచి రెండేళ్ల లో చేసిన అభివృద్ధి వివరించాలని డిమాండ్‌ చేశారు.  పసుపు బోర్డు తెస్తానని అమలుచేయని నాయకుడు అరవింద్‌ రాజకీయంగా ఫేయిల్‌ అయ్యారని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, రాయికల్‌ మున్పిఫల్‌ వైస్‌ చైర్‌ గండ్ర రమాదేవి, ఎంపీపీ సంధ్యారాణి, కౌన్సిలర్లు వొద్ది శ్రీలత, వానరాసి మల్లవ్వ, మెక పద్మావతి, దాసరి లావణ్య, అడువాల జ్యోతి, బద్దం లత, మాజీ ఎంపీపీ శారద పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:02:00+05:30 IST