-
-
Home » Telangana » Karimnagar » jagityal collector ravi
-
పల్లె ప్రగతి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T05:33:29+05:30 IST
జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రవి అధికారులకు సూచించారు.

జగిత్యాల టౌన్, డిసెంబరు 5: జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రవి అధికారులకు సూచించారు. శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండల అధికారులతో పల్లెప్రగతి పనుల పురోగతిపై జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రయింగ్ ప్లాట్ ఫామ్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం త్వరగా పూర్తి చెయ్యాలని సూచించారు. వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్, పల్లెప్రకృతి వనాలలో పూర్తి స్థాయిలో పూల మొక్కల నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఎకరానికి 4000 మొక్కలు నాటే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని, పాత్ వే కొరకు ఎక్కువ స్థలం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమ్యూనిటీ సోక్‌ఫిట్‌ల పురోగతి చాలా వెనుకబడిందని, వెంటనే మంజూరు తీసుకోవాలని పనులు ప్రారంభిం చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.