వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం

ABN , First Publish Date - 2020-03-18T12:18:42+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం చెబుతు న్నా వైద్యసిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. పలు గ్రామాల నుంచి ప్రసవాల కోసం స్థానిక ప్రభుత్వ

వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం

 ప్రసవాలన్నీ ప్రైవేటు ఆసుపత్రులకు

 సిబ్బంది తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

ఓదెల, మార్చి 17: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం చెబుతు న్నా వైద్యసిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. పలు గ్రామాల నుంచి ప్రసవాల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళలు ప్రైవేటు ఆసుపత్రు లకు వెళ్లినట్లు కలెక్టర్‌ ఎదుట బహిర్గతమయ్యాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, వైద్యాధికారి సుధాకర్‌ సందర్శించారు. ఈ సమయంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సైతం సమావేశానికి ఆ లస్యంగా వచ్చారు. దీంతో గ్రామాలవారిగా ఏఎన్‌ ఎంలను, సూపర్‌వైజర్లను ప్రసవాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఓదెల, ఇందూర్తి, శానగొండ, బీమరపల్లి తదితర గ్రామాలకు చెందిన గర్భిణులు కరీంనగర్‌, జమ్మికుంట, హుజురాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లినట్లు కలెక్టర్‌ దృష్టికి వచ్చింది.


దీంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ చర్యలు ఎం దుకు తీసుకోవడం లేదని, గ్రామాల్లో ఏం చేస్తున్నా రని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తూ అసంతృప్తిని వ్య క్తంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు వైద్యం కంటే ఎక్కువగానే చికిత్సలు, పరీక్షలు ప్రభుత్వ ప థకాలు అందుతున్నప్పటికీ ప్రసవాలు ఇక్కడ ఎం దుకు నిర్వహించడం లేదని వైద్య సిబ్బందిని మందలించారు. ఇక్కడి ఆసుపత్రిలో సిబ్బంది బా ధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, క్రమశిక్షణ, శ్రద్ధ లేదని తెలిపారు. ప్రసవాలు ఆసుపత్రిలోనే ని ర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది వి ధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ఉన్నతాధికారు లకు రిపోర్టు చేయాలని డాక్డర్‌ను ఆదేశించారు. 



కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..

విదేశాల నుంచి వచ్చే వ్యక్తులను నిర్లక్ష్యం చేయకుండా గుర్తించి ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రాంమోహన్‌కు సూచిం చారు. శానగొండకు చేరుకున్న స మ్మయ్య అనే వ్యక్తి పట్ల ఎప్పటిక ప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసు కుంటూ పరిశీలించాలని, గ్రామంలో 15రోజులపాటు తిరగకుండా అలాం టి వ్యక్తులకు అవగాహన కల్పించా లని కోరారు. ప్రస్తుతం సమ్మయ్య ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ నిరంతరం పరిశీలిస్తూ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకో వాలని కోరారు. తహసీల్దార్‌ ఎంపీడీఓ, పీఓ, ఎస్‌ఐ కలిసి సమ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో పీఓ వసంతరావు, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఎంపీడీఓ సత్తయ్య, డాక్టర్‌ నీతారెడ్డితో పాటు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T12:18:42+05:30 IST