ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం

ABN , First Publish Date - 2020-10-04T10:05:23+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం

సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైంది 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి


సుభాష్‌నగర్‌, అక్టోబరు 3: ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఎల్‌ఆర్‌ఎస్‌ను నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా పేద ప్రజలపై ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వంచన చేస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని తుంగలో తొక్కడం సీఎం కేసీఆర్‌కు అలవాటయిందన్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, 2018 ఎన్నికల సమయంలో పేదలకు ఉచిత డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చా క పూర్తిగా విస్మరించిందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పేరుతో మరోమారు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో ప్రసంగాలు తప్ప కార్యాచరరణ ఏమాత్రం లేదని అన్నారు.


ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయకుండా ఎల్‌ఆర్‌ ఎస్‌ స్కీంలో పేదల ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 100, 200 గజాలలోపు ఉన్న పట్టణ, గ్రామ పంచాయతీ పరిధిలోని కొనుగోలుదారులకు ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలని, రిజిస్ర్టేషన్ల ప్రక్రియ వెంటనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ, బీజేపీ కరీంనగర్‌ జోన్ల అధ్యక్షులు పాదం శివరాజ్‌, దుర్శేడ్‌ అనూప్‌ కుమార్‌, నరహరి లక్ష్మారెడ్డి, అవుదుర్తి శ్రీనివాస్‌, నాగసముద్రం ప్రవీణ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ దుబాల శ్రీనివాస్‌, బీవేఐఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు బండ సుమ రమణారెడ్డి, చొప్పరి జయశ్రీవేణు, నక్క పద్మ కృష్ణ, కచ్చు రవి, కాసర్ల ఆనంద్‌, కొలగాని శ్రీనివాస్‌, పెద్దపల్లి జితేందర్‌, నాయకులు బేతి మహేందర్‌ రెడ్డి, రమణారెడ్డి, కన్న కృష్ణ, నాగేశ్వర్‌ రెడ్డి, మేకల ప్రభాకర్‌ యాదవ్‌, సాయిని మల్లేశం, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, రామానుజం, గడ్డం నాగరాజు, పుప్పాల రఘు, చంద్రశేఖర్‌, గాజుల స్వప్న, సుజాతరెడ్డి, కడార్ల రతన్‌, మడిశెట్టి సంతోష్‌, అశోక్‌, ప్రవీణ్‌, పోరెడ్డి కిషన్‌ రెడ్డి, వేణుగోపాల్‌రావు, ఆదిరెడ్డి, మల్లేశం రవి యాదవ్‌, సుంకె యశోద, చైతన్య, గుర్రం పద్మారెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, నాంపల్లి శ్రీనివాస్‌, కుర్ర రాజేశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T10:05:23+05:30 IST