-
-
Home » Telangana » Karimnagar » Initiation of the Land Victims Association to provide protection
-
రక్షణ కల్పించాలని భూ బాధితుల సంఘం దీక్ష
ABN , First Publish Date - 2020-12-16T05:26:22+05:30 IST
మాజీ ఎమ్మెల్యే సానా మారుతి నుంచి రక్షించాలని కోరుతూ భూ బాధితుల సంఘం మంగళవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టింది.

సుభాష్‌నగర్, డిసెంబరు 15: మాజీ ఎమ్మెల్యే సానా మారుతి నుంచి రక్షించాలని కోరుతూ భూ బాధితుల సంఘం మంగళవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టింది. స్వార్జితంతో కొనుగోలు చేసి 16 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని కాజేయాలని చూస్తూ బెదిరింపులు, దాడులు చేయిస్తూ దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు. తమ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి చంద్రకళ, మురలీధర్‌రావు, కె అర్చన, సదానందం, బి అరుణ, ఉమారాణి, లియాకత్ అలీ, కె భగవాన్, పి శ్వేత, కోమల్‌రెడ్డి ఉన్నారు.