రామగుండంలో లాక్‌డౌన్‌ మరింత కఠినం

ABN , First Publish Date - 2020-04-24T10:58:39+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు.

రామగుండంలో లాక్‌డౌన్‌ మరింత కఠినం

బండి బయటకు వస్తే సీజ్‌

కర్ఫ్యూ సమయంలో లాఠీలకు పని

డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

జులాయిలతోనే సమస్యలు


కోల్‌సిటీ, ఏప్రిల్‌ 23: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో కరోనా నివారణకు సరిహద్దుల చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. నిత్యావసర కొనుగోలు సమయం దాటిన తరువాత ద్విచక్రవాహనాలు రోడ్డెక్కుతే సీజ్‌ చేస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 8వేల వాహనాలను సీజ్‌చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘనలపై రా మగుండం సీపీ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయ నే రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. రోజుకొక ప్రాంతం లో ఆకస్మికంగా పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు.


గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ జరిపారు. కోల్‌బెల్ట్‌లో యువత లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతుండడంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట లాఠీలు ఝుళిపిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ లాఠీచార్జి చేస్తున్నారు. సీఐలు, ఎస్‌ఐలు రాత్రిపూట బైక్‌లపై తిరుగుతూ యువలను చెదరగొడుతునారు. సింగరేణి కాలనీల్లో యువకులు రాత్రివరకు గుంపులుగుంపులుగా తిరగడం సమస్యగా మారుతోంది. వీరి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వారికి లాఠీలతో సమాధానం చెబుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లం ఘించిన షాపులు, భౌతిక దూరం పాటించని వ్యక్తులపై ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో ఎపిడమిక్‌ యాక్ట్‌ 1891 ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.


ఒక్క గోదావరిఖని వన్‌టౌన్‌లోనే ఇప్పటివరకు 50ఎఫ్‌ఐఆర్‌లు నమోద య్యా యి. కేసులు నమోదైన వారంతా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. రామగుండం పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో వాహనాల అను మతి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. గతంలో మంజూరు చేసిన పాసులను సైతం తనిఖీ చేస్తున్నారు. బొగ్గు గనులు, ఎన్‌టీపీసీల్లో పని చేస్తున్న కార్మికులను ఆయా షిప్టులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అలా కాకుండా రోడ్లపై వస్తే వాహనాలు సీజ్‌ చేసి కేసులు పెడుతున్నారు. 


పోలీసుల తిప్పలు : లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తు న్న పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పికెట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రాత్రిపగలు విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ఉష్ణోగ్రతలు 42డిగ్రీలు దాట డం, వడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. విధుల్లో ఉన్న పోలీసుల విషయంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బయట టీ కూడా దొరక ని పరిస్థితి. బయట తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఏ సమయమైనా ఇంటికే వెళ్లి భోజనం చేస్తున్నారు. దీనికి తోడు సీజ్‌ చేసిన బండ్లను తరలిం చే విషయంలో కూడా రిస్క్‌లు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-04-24T10:58:39+05:30 IST