అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-08-11T10:34:51+05:30 IST

అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయలో

అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయలో అదనపు కలెక్టర్‌ ఎ నరసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, మెప్మా పీడీ రవీందర్‌తో కలిసి వీధి వ్యాపారులు, హరితహారం, పబ్లిక్‌ టాయిలెట్ల పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీధి వ్యాపారులను గుర్తించడం వేగవంతం చేయాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరినీ వదలకుండా, అనర్హులను జాబితాలో చేర్చకుండా చూడాలని అన్నారు. తదుపరి సమావేశం వరకు ప్రతి మున్సిపాలిటీలలో స్ర్టీట్‌ వెండర్స్‌ను గుర్తించడంలో అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వయంగా ప్రతి మున్సిపాలిటీ తిరిగి పర్యవేక్షిస్తానని, అర్హులైన జాబితా తయారు చేయడంలో ఎలాంటి పొరపాటు జరిగినా సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.


అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించకపోతే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి, మంకీఫుడ్‌ కోర్టు పనులు ఆగస్టులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చింతవనాలు ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయాలని అన్నారు. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలను ఈనెల 15లోగా ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు.


ఫప్రజా సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరించాలి..

డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో ప్రజలు తెలిపే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలను ప్రజలు తెలిపినప్పుడు ప్రాధాన్యమిచ్చి వారం రోజుల్లో పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలని అన్నారు. గతంలో తెలిపిన సమస్యలు పెండింగ్‌లో ఉంటే వాటిని ప్రథమ ప్రాధాన్యంగా ముందుగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఫోన్‌ ద్వారా తమ సమస్యలు తెలుపగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సమాధానమిచ్చారు.

Updated Date - 2020-08-11T10:34:51+05:30 IST