మానవత్వం చాటుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-03-23T10:47:22+05:30 IST

పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీసులు ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు

గంగాధర, మార్చి 22: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీసులు ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. జనతా కర్ఫ్యూ కొనసాగు తున్న సమయంలో గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన రాధిక ఆది వారం పురిటి నొప్పులతో బాధపడుతోంది. వాహ నంలో తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అందరు బంద్‌లో పాల్గొంనా రు. కుటుంబ సభ్యులు విష యాన్ని ఎస్‌ఐ తాండ్ర వివేక్‌కు తెలపగా వెంటనే బాధితు రాలి ఇంటికి చేరుకు పోలీసు వాహనంలో గర్భిణిని కరీంన గర్‌కు తరలించారు. ఆపద సమయంలో నిండు గర్భిణిని పోలీసు వాహనంలో వైద్యశాలకు తరలించి ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ వివేక్‌,  కానిస్టేబుల్‌ పరుశు రాములును మండల ప్రజలు అభినందిం చారు. రాధికకు పండంటి కూతురు జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-03-23T10:47:22+05:30 IST