రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరు వాన

ABN , First Publish Date - 2020-08-18T10:48:34+05:30 IST

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)//తంగళ్లపల్లి/చందుర్తి: రాజన్న జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇండ్లు నేలమట్టమయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరు వాన

నిండుతున్న చెరువులు... మత్తడి దూకుతున్న ప్రాజెక్ట్‌లు 

 చందుర్తిలో ఎల్లంపల్లి కాలువలో ఇద్దరు బాలికల మృతి

 సిద్దిపేట జిల్లా దర్గపల్లి వాగులో తంగళ్లపల్లి గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గల్లంతు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)//తంగళ్లపల్లి/చందుర్తి: రాజన్న జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇండ్లు నేలమట్టమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పోర్లుతుండగా చెరువులు, ప్రాజెక్ట్‌లోకి వరదనీరు చేరుతుంది. కొన్ని ప్రాజెక్ట్‌లు, చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. జిల్లా అధికారులు వర్షం పరిస్థితులను పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. సోమవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని అదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లాలో 39.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


వివిధ మండలాల్లో పంట పోలాలు నీటమునిగాయి. పలు ఇండ్లు కూలిపోయాయి.  జిల్లా అధికారులు వర్షం పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. సోమవారం పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని అదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లాలో 39.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  వివిధ మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. 


ఇద్దరు బాలికల మృతి..

చందుర్తి మండలం సనుగులలోని గంగిరెద్దుల కుటుంబాలకు చెందిన ముచ్చర్ల ఎల్లయ్య, మల్లవ్వల కూతురు లావణ్య (13), ముచ్చర్ల జన్నయ్య, ఎల్లవ్వల కూతురు అంజలి (12)లు కాలనీలోని మరో నలుగురు పిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ స్నానం చేసేందుకు లింగంపేట నుంచి లచ్చపేటకు వెళ్లే నిర్మాణంలో ఉన్న ఎల్లంపల్లి కాలువలో స్నానం చేసేందుకు దిగి మృత్యువాత పడ్డారు. కాలువపై ఉన్న మరో నలుగురు చిన్నారులు కాలనీలోకి వెళ్లి జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి కాలువ నుంచి తీసేసరికి మృతి చెంది ఉన్నారు. సంఘటనా స్థలానికి చందుర్తి సీఐ మొగిలి, ఎస్‌ఐ సునీల్‌లు వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

యువకుడి గల్లంతు..

తంగళ్లపల్లి మండల కేంద్రానికి జంగపెల్లి శ్రీనివాస్‌(33)అనే బుధవారం ఓ కారులో పెద్దపల్లి జిల్లా మంథని ఇసుక క్వారీకి వెళ్తున్నాని చెప్పి బయల్దేరాడు. తనతో పాటు ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన జుట్టు సురేశ్‌, తంగళ్లపల్లి మండలం రాంచంద్రపూర్‌ గ్రామానికి చెందిన బొద్దు శ్రీధర్‌లను సైతం క్వారీకి తీసుకు వెళ్లాడు. క్వారీ నుండి ఇంటికి  తిరిగి వస్తున్న క్రమంలో క్వారీలో పని చేసే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడిగ గ్రామానికి చెందిన ఆనంతారం శ్రీనివాస్‌ వారితో చేరాడు.


తనను బద్దిపడిగలో దించడానికి  వెళ్తున్న క్రమంలో ఉధృతంగా ప్రవాహిస్తున్న దర్గాపల్లి వాగు వద్దకు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో  చేరుకున్నారు. రోడ్డుపై క్యాజువే నుండి వదద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ  కారు  దాటే క్రమంలో వాహనంతో పాటు నలుగరు వరద నీటిలో కొట్టుకుపోయారు. శ్రీనివాస్‌, శ్రీధర్‌, సురేశ్‌లు కొద్ది దూరం నీటిలో కొట్టుకు పోయి చెట్టును ఆసరా చేసుకుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఆందించారు.


దీంతో స్థానికులు, బంధువులు, పోలీసులు అక్కడికి చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. కాగా కారుతో పాటు జంగపెల్లి శ్రీనివాస్‌ ఆచూకి గల్లంతయ్యింది. రాత్రి నుంచి వాహనంతో పాటు  శ్రీనివాస్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలసుకున్న కుటుంబసభ్యులు, మిత్రులు, టీఆర్‌ఎస్‌ నాయకులు సంఘటన స్థలం వద్దకు తరలి వెళ్లారు.


శ్రీనివాస్‌ ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్‌ల సహాయంతో గాలింపు చేపట్టారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ తంగంళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మృతుడికి భార్య మానస, ఇద్దరు కుతుళ్లు కృతిక(7), లాస్య(5)లు ఉన్నారు. గల్లంతైన శ్రీనివాస్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మర ం చేయాలని మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీనివాస్‌ గల్లంతైన విషయం తెలుసుకున్న కేటీఆర్‌ తక్షణమే స్పందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడారు. కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ఓదార్చారు.


ముంపునకు గురైన వారిని ఆదుకుంటాం

వేములవాడ, ఆగస్టు 17 : వరుసగా కురుస్తున్న వర్షాలతో ముంపునకు గురైన వారిని ఆదుకుంటామని  సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక ్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. సోమవారం వేములవాడలో పర్యటించిన ఆయన మూలవాగు వంతెన వద్ద చె త్తా చెదారం గమనించి మున్సిపల్‌ అఽదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ ప్రస్తుత తరుణంలో అత్యంత కీలకమని అన్నారు.


చెత్త సేకరణ వాహనాల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం వరద నీటిలో ముంపునకు గురైన కోనాయపల్లి శివారులోని బేడ బుడిగె జంగాల కాలనీని పరిశీలించారు. వరద ప్రభావం తగ్గేంతవరకు కాలనీవాసులకు, వసతి, భోజన సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, టీపీఎస్‌ అంజయ్య, ఏఈలు నర్సింహస్వామి, శ్రవణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-08-18T10:48:34+05:30 IST