ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-04-14T12:47:16+05:30 IST

ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు

ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 13: ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బందిని  ధర్మామీటర్‌తో పరీక్షించారు. సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నామ న్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నామని, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, టౌన్‌ సీఐ వెంకటనర్సయ్య, స్సెషల్‌ బ్రాంచ్‌ సీఐ మొగిలి, ఆర్‌ఐ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-14T12:47:16+05:30 IST