ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-05-18T10:28:40+05:30 IST

జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

పెద్దపల్లి కల్చరల్‌, మే 17: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పా టిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో హనుమాన్‌ పతాకవిష్కరణ చేసి పేద ప్రజలకు కూరగాయలు, పెరుగన్నం పంపిణీ చేశారు. ఉప్పు రాజు, కాసనగోట్టు శశిరేఖ-చంద్రయ్య, వినయ్‌, విజయ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.  


పెద్దపల్లి మండలంలో.. 

పెద్దపల్లి రూరల్‌, మే 17: మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భౌతికదూరం పాటించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 


ఎలిగేడులో...

ఎలిగేడు : మండలంలో హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్‌ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజల్లో పాల్గొన్నారు. 


ఓదెలలో..

ఓదెల, మే 17: మండలంలో భక్తులు హనుమాన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.లాక్‌డౌన్‌ కారణంగా హనుమాన్‌ ఆలయాల్లో భక్తులంతా భౌతికదూరం పాటిస్తూ పూజలు నిర్వహించారు. 


మంథనిలో..

మంథని, మే 17: హనుమాన్‌ జయంతి వేడుకలను మంథని పట్టణంలోని పలు శ్రీహనుమాన్‌ ఆలయాల్లో భక్తులు ఆదివారం నిరాడంబరంగా జరుపుకున్నారు. పలు ఆ లయాల్లోని శ్రీహనుమాన్‌ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. 
Updated Date - 2020-05-18T10:28:40+05:30 IST