హాస్టల్‌ ఘటనను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-16T10:00:00+05:30 IST

హాస్టల్‌ ఘటనను పట్టించుకోని ప్రభుత్వం

హాస్టల్‌ ఘటనను పట్టించుకోని ప్రభుత్వం

  • - జాతీయ మహిళా, ఎస్సీఎస్టీ కమీషన్‌లకు ఫిర్యాదు చేస్తా
  • - హాస్టల్‌లో వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు
  • - జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు
  • - సిరిసిల్లలో ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 15 : సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నాయకుడిని అరెస్ట్‌ చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్న సంఘటనగా చిత్రీకరించిందని.. పట్టించుకోవడం లేదని.. దీనిపై జాతీయ మహిళా, ఎస్సీఎస్టీ కమీషన్లకు ఫిర్యాదు చేస్తానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ను శని వారం ఎంపీ బండి సంజయ్‌ సందర్శించారు. హాస్టల్‌ లో వసతులను పరిశీలించడంతోపాటు హాస్టల్‌లో టీఅర్‌ఎస్‌ నాయకుడు చేసిన అసభ్యకర సంఘటన పై అమ్మాయిలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. నిరుపేదలైన తల్లిదం డ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశయంతో ప్రభుత్వంపై నమ్మకంతో  ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పిస్తార న్నారు. అలాంటి హాస్టల్‌లో క్యాటరింగ్‌ కాంట్రాక్టును దక్కించుకున్న టీఅర్‌ఎస్‌ నాయకుడు తన వంట మనుషులతో అమ్మాయిలను వేధింపులకు గురి చేయడంతో పాటు అభ్యకరంగా వ్యవహరించడం దారుణ మని ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రభుత్వం చిన్న సంఘటన గా చిత్రీకరించి అ నాయకుడిని అరెస్ట్‌ చేసి పట్టించు కోవడం లేదని ఆరోపించారు. అరెస్ట్‌ చేస్తే ఏమీ జరగదన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నిరుపేద యువకులను పోలీసులు అరెస్ట్‌ చేసి మూడురోజలుపాటు చిత్రహంసలకు గురిచేయడంతోపాటు థర్డ్‌డిగ్రీని ఉపయోగించి, మత్తు సూదులు, గోళీలను వేసి రోకలబండలను ఎక్కించి నడువలేకుండా కొట్టార న్నారు. హాస్టల్‌లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చిన నాయకుడిని నామమాత్రంగానే అరెస్ట్‌ చేశారని అన్నారు. ఈ సంఘటనపై అమ్మాయిలను భయపె డితే  జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తామని.. ఈ ఘటన వెనుక ఎవరున్నారో బయటకు తీస్తామని అన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించి అమ్మాయిలకు సహకరించి కఠి న చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక నుంచి జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు నిత్యం తనిఖీలు చేసి అమ్మాయిలకు అండగా ఉండాలని కోరారు. ప్రస్తుతం హాస్టల్‌ ఎలాంటి వస తులు లేకుండా ఉందన్నారు. అధికారులు స్పందించి అ భవనంలో నుంచి ఫ్యామీలు, బ్యాచ్‌లర్లను ఖాళీ చేయించాలని కోరారు. వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకవెళుతానన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని మాపార్టీ నాయకులకు సూచించామన్నారు.

 

బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమేంటి?

- దాడులు చేసిన వారిని అరెస్ట్‌ చేయకపోతే అందోళనలకు దిగుతా

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త ఇంటిపై దాడులు చేసి ఇంటిని ధ్వం సం చేసిన వారిని అరెస్టు చేయకుండా బీజేపీ కార్యకర్తపైనే అక్రమంగా కేసులు నమోదు చేయడం సరైందికాదని ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శాంతినగర్‌లోని గుడ్ల విష్ణు ఇంటికి వెళ్లి దాడిలో ధ్వంసమైన ఇంటి తలుపులను పరిశీలించి కుటుంబసభ్యులను పరా మర్శించారు.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తల పై పోలీసులు అక్రమకేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి వీడా లని కోరారు. విష్ణు వాట్సాప్‌లో రెచ్చగొట్టే పోస్టు పెట్టారంటూ కేసునమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించడం దారుణమన్నారు. విష్ణుకు కోర్టులో బెయిల్‌ రాకుండా పోలీసులు కౌంటర్‌ పిటిష న్‌ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ వత్తాసుగా పనిచేయడం మానుకొని దాడి చేసిన వారందరిని అరెస్ట్‌ చేయాలని.. లేకుంటే తానే స్వయంగా అందోళనలు చేపట్టి సిరిసిల్ల బంద్‌ కు పిలుపునిస్తామన్నారు. సిరిసిల్లలోని ఓ అలయంలో అసభ్యకరమైన రాతలను రాసిన వారిని గుర్తించి అరెస్ట్‌ చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, కౌన్సిలర్లు బొల్గం నాగరాజుగౌడ్‌, గూడూరిభాస్కర్‌, మ్యాన రాంప్రసాద్‌, మేకల కమాలకర్‌, శీలంరాజు, బీజేవై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, మల్లడపేట భాస్కర్‌, అడెపు రవిందర్‌, పెరుమాండ్ల ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T10:00:00+05:30 IST