విద్యుత్‌ ఆదాలో బంగారు, వెండి పతకాలు

ABN , First Publish Date - 2020-12-21T05:25:43+05:30 IST

రామగుడం నగరపాలక సంస్థకు ఎనర్జి సేవింగ్‌లో బంగారు పతకం లభించింది.

విద్యుత్‌ ఆదాలో బంగారు, వెండి పతకాలు
అవార్డు అందుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌

కోల్‌సిటీ, డిసెంబరు 20: రామగుడం నగరపాలక సంస్థకు ఎనర్జి సేవింగ్‌లో బంగారు పతకం లభించింది. విద్యుత్‌ను ఆదాచేయడంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఈఈ సుచరణ్‌లకు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఇంధనశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానీయాలు ఈ అవార్డును అందజేశారు. గత ఏడాది సిల్వర్‌ మెడల్‌ దక్కగా ఈ ఏడాది రామగుండంకు గోల్డ్‌మెడల్‌ దక్కింది. రాష్ట్రంలోని పరిశ్రమలలో ఇంధనాన్ని పొదుపు చేసి న పరిశ్రమలకు టీఎస్‌ఆర్‌ఈడీసీ ప్రతిఏటా ఈ అవార్డులను అందజేస్తున్నది. 

ఎన్టీపీసీకి సిల్వర్‌ మెడల్‌..

జ్యోతినగర్‌, డిసెంబరు 20 : రామగుడం ఎన్టీపీసీకి తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ కన్జర్వేష న్‌ 2020(సిల్వర్‌)అవార్డు లభించింది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తాని యా చేతుల మీదుగా రామగుండం ప్రాజెక్టు జీఎం(ఓఅండ్‌ఎం) ఎ.కె.సామియార్‌, ఏజీఎం (ఈఈఎంజీ) మనోజ్‌ కుమార్‌ అవార్డు ను అందు కున్నారు. అవార్డు సాధించడంలో కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను ప్రాజెక్టు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌కుమార్‌ అభినందించారు. భవిష్య త్‌లో ఇదే స్ఫూర్తితో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. 

Updated Date - 2020-12-21T05:25:43+05:30 IST