భౌతిక దూరాన్ని గుర్తుచేసే పరికరం

ABN , First Publish Date - 2020-07-19T06:45:04+05:30 IST

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అప్రమత్తం చేసే పరికరాన్ని..

భౌతిక దూరాన్ని గుర్తుచేసే పరికరం

  • - ‘ఖని’ విద్యార్థి ప్రతిభ

మార్కండేయకాలనీ, జూలై 18 : కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అప్రమత్తం చేసే పరికరాన్ని గోదావరిఖనికి చెందిన విద్యార్థి రూపొందించాడు. స్థానిక వినోభానగర్‌కు చెందిన సంబోదు సాయిరోహిత్‌ అనే విద్యార్థి కార్లకు వాడే సెన్సార్‌ను ఉపయోగించి ఆన్‌రోడ్‌ యూఎన్‌ఓ పరికరానికి కోడ్‌తో లైటింగ్‌, సౌండ్‌, రేంజ్‌ రూపొందించారు. ఆ పరికరం మనదగ్గర ఉంటే ఎదురుగా 30ఫీట్ల ముందు ఎవరు వచ్చినా బీప్‌ శబ్ధం తో అలర్ట్‌ చేస్తుంది. దీంతో మనం వెంటనే అప్రమత్తం కావచ్చు. గజ్వెల్‌ ప్రభుత్వ మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా(మెకానికల్‌) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయిరోహిత్‌ వెయ్యి రూపాయ ల ఖర్చుతో ఈ పరికరం తయారు చేశాడు.  

Updated Date - 2020-07-19T06:45:04+05:30 IST