ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

ABN , First Publish Date - 2020-08-01T11:06:56+05:30 IST

రావమ్మా.. మహాలక్ష్మీ రావమ్మా.. అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.

ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 31: రావమ్మా.. మహాలక్ష్మీ రావమ్మా.. అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం వ్రతాలు, అర్చనలు, అమ్మవారి నామస్మరణలు, దీపకాంతులతో ప్రతి గృహం కళకళలాడింది. వ్రతానికి సమీప బంధువులను, మిత్రులను మాత్రమే ఇంటికి ఆహ్వానించారు. పసుపు కుంకుమలు, పప్పు బెల్లాలు, వాయినాలుగా ఇచ్చుకొని ఆశీస్సులు పొందారు. చకిలం స్వప్న ఆధ్వర్యంలో అమ్మ వారి వ్రతం అనంతరం మహిళలకు వాయినాలుగా మాస్కులు, శానిటైజర్‌ కూడా అందజేశారు. నగరంలోని యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Updated Date - 2020-08-01T11:06:56+05:30 IST